GST Cases: జీఎస్టీ సంబంధిత కేసులు త్వరలో పరిష్కారం.. 28 రాష్ట్రాల్లో 31 కొత్త బెంచ్‌లు

|

Sep 15, 2023 | 6:18 PM

జీఎస్టీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 31 జీఎస్టీ అప్పీలేట్ అథారిటీలను సృష్టించబోతోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. చాలా నెలలుగా స్థానిక కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నవారికి ఈ నిర్ణయం చాలా సౌలభ్యాన్ని అందిస్తుంది. స్థానిక కోర్టులు, హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టుకు..

GST Cases: జీఎస్టీ సంబంధిత  కేసులు త్వరలో పరిష్కారం.. 28 రాష్ట్రాల్లో 31 కొత్త బెంచ్‌లు
Gst Cases
Follow us on

దేశంలో జీఎస్టీకి సంబంధించిన ఎన్నో కేసులు ఉన్నాయి. వాటిన పరిష్కరించడంలో మరింత ఆలస్యం అవుతోంది. అయితే కోర్టుల్లో ఇతర కేసులు ఉండటంతో ఈ జీఎస్టీ కేసులతో మరింత భారం ఏర్పడుతోంది. దీని కారణంగా కేసుల పరిష్కారం మరింతగా ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో జీఎస్టీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 31 జీఎస్టీ అప్పీలేట్ అథారిటీలను సృష్టించబోతోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. చాలా నెలలుగా స్థానిక కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నవారికి ఈ నిర్ణయం చాలా సౌలభ్యాన్ని అందిస్తుంది. స్థానిక కోర్టులు, హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టుకు కూడా ఎంతో ఊరట లభించనుంది. అలాంటి కేసుల భారం తగ్గుతుంది.

ఈ రాష్ట్రాల్లో రెండు కంటే ఎక్కువ బెంచీల ఏర్పాటు:

కాగా, ప్రస్తుతం పన్ను అధికారుల నిర్ణయాల పై అసంతృప్తితో ఉన్న పన్ను చెల్లింపుదారులు సంబంధిత హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తోంది. హైకోర్టులు ఇప్పటికే పెండింగ్‌ లో ఉన్న కేసులతో భారం పడుడుతోంది. అలాగే జీఎస్టీ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక బెంచ్‌లు లేవు. అందుకే కేసుల పరిష్కారానికి చాలా సమయం పడుతుంది. నోటిఫికేషన్ వివరాల ప్రకారం.. గుజరాత్, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా, నగర్ హవేలీ, డామన్ మరియు య్యూలలో జీఎస్టీఏటీ రెండు బెంచ్‌లు ఉంటాయి. గోవా, మహారాష్ట్ర లో మొత్తం మూడు బెంచ్‌లు ఏర్పాటు చేయనున్నారు. కర్ణాటక, రాజస్థాన్‌లలో రెండు బెంచ్‌లు, ఉత్తరప్రదేశ్‌లో మూడు బెంచ్‌లు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

పశ్చిమ బెంగాల్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరిలలో రెండు జిఎస్‌టిఎటి బెంచ్‌లు, కేరళ, లక్షద్వీప్‌లలో ఒక్కొక్క బెంచ్ ఉంటుంది. ఏడు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలలో బెంచ్ ఉంటుంది. జీఎస్టీఏటీ అన్ని ఇతర రాష్ట్రాల్లో బెంచ్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఏఎంఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్ సీనియర్ భాగస్వామి రజత్ మోహన్ మాట్లాడుతూ.. పన్ను కేసులను పరిష్కరించడంలో జీఎస్టీ అప్పీలేట్ అథారిటీలు చాలా అవసరమని వారు పన్ను వివాదాల పరిష్కారానికి నిష్పాక్షికమైన, నిపుణులైన, సమర్థవంతమైన ఫోరమ్‌ను అందిస్తారు. మొదటి దశలో ప్రభుత్వం 31 బెంచ్‌లను నోటి ఫై చేసింది. ఇప్పుడు ట్రిబ్యునళ్లకు అనువైన స్థలాలను గుర్తించడం, అర్హులైన సభ్యులను నియమించడం, అవసరమైన మౌలిక సదుపాయాలు, వనరులు కల్పించడం వంటి రెండో దశ పనులను ప్రారంభించనున్నట్లు మోహన్ తెలిపారు. దీనివల్ల పన్నుల శాఖకు మేలు జరగడమే కాకుండా ప్రజలకు కూడా ఎంతో మేలు జరుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..