Post Office Scheme: పోస్టల్ శాఖ రోజురోజుకు కొత్త కొత్త స్కీమ్‌లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువస్తోంది. గ్రామ సుమంగళ్ రూరల్ పోస్టల్‌లైఫ్ ఇన్సూరెన్స్ పేరుతో మరో పథకం అందుబాటులో ఉంది. దీని వల్ల చెల్లించిన ప్రీమియం డబ్బులు వెనక్కి ఇవ్వడమే కాదు.. ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా లభిస్తుంది. కాకపోతే ఇది గ్రామాల్లోని వారికే వర్తిస్తుంది. ఇందులో 2 రకాల ప్లాన్లు ఉన్నాయి. మీరు రోజు రూ.95 చొప్పున పె ట్టుబడి పెడితే.. స్కీమ్ గడువు ముగిసేనాటికి మీకు రూ.14 లక్షలు రిటర్న్ ఇస్తారు. రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమును 1995లో ప్రారంభించారు. దీని కింద ఆరు రకాల ఇన్సూరెన్సు స్కీములు ఉన్నాయి. వాటిలో ఒకటి గ్రామ సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ పథకం కింద సదరు వ్యక్తి మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల వరకు వస్తాయి. స్కీమ్ ముగిసే నాటికి బతికి ఉంటే రూ.14 లక్షల వరకు వస్తాయి. అయితే ఈ స్కీమ్ 15 ఏళ్లు, 20 ఏళ్ల ప్లాన్ ఉంది. ఈ పాలసీ తీసుకునేవారి కనీస వయసు 19 సంతవ్సరాలు. 15 ఏళ్ల ప్లాన్ ఎంచుకునేవారు తమకు 45 ఏళ్ల వచ్చే వరకూ ప్లాన్ పెంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే 20 ఏళ్ల ప్లాన్ ఎంచుకునేవారు 40 ఏళ్లు వచ్చే వరకు ప్లాన్ పెంచుకునే అవకాశం ఉంటుంది.
ఇక 15 సంతవ్సరాలు తీసుకునే వారు ఆరేళ్ల తర్వాత 20 శాతం డబ్బులు వెనక్కి ఇస్తారు. 9 ఏళ్ల తర్వాత మరో 20 శాతం, 12 ఏళ్ల తర్వాత మరో 20 శాతం వెనక్కి ఇస్తారు. మిగతా 40 శాతం, బోనస్ కలిపి పాలసీ గడువు తీరిన తర్వాత ఇచ్చేస్తారు. ఇదే విధంగా 20 ఏళ్ల పాలసీ తీసుకున్నవారికి 8 ఏళ్లు, 12 ఏళ్లు, 16 ఏళ్లకు 20 శాతం చొప్పున మనీ బ్యాక్ అందిస్తారు. మిగతా 40 శాతం, బోనస్ కలిపి, గడువు ముగిసిన తర్వాత ఇస్తారు. ఇక 25 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్లకు పాలసీ తీసుకుంటే మొత్తం రూ.7 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.2,853 అంటే రోజుకు రూ.95. మూడు నెలలకోసారి ప్రీమియం చెల్లించాలంటే రూ.8,449 చెల్లించాలి. ఆరు నెలలకైతే రూ.16,715, సంవత్సరానికి ప్రీమియం రూ.32,735 అవుతుంది. పాలసీ గడువు ముగిసేనాటికి మొత్తం చెల్లించాల్సింది రూ.13.72 లక్షలు అవుతుంది.