నిరుద్యోగుల‌కు మైక్రోసాఫ్ట్ ఆఫర్ .. !

| Edited By: Ravi Kiran

Sep 01, 2020 | 7:56 PM

రోనా దెబ్బకి ఉద్యోగాలు ఉంటాయో ఉడుతావో తెలియని పరిస్థితుల్లోనూ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్. ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్‌, క్లౌడ్ స్పేస్ లో 1500 కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు ఫ్లాన్ చేసింది. ఇందుకోసం 75 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డితో 5,23,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో జార్జియాలోని అట్లాంటాలో కొత్త కార్యాల‌యం రూపుదిద్దుకోనున్న‌ట్లు సంస్థ ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఏడాదిక‌ల్లా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తోంది. జార్జియాలో మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గ‌జం పెట్టుబ‌డులు పెట్ట‌డం […]

నిరుద్యోగుల‌కు మైక్రోసాఫ్ట్ ఆఫర్ .. !
Follow us on

రోనా దెబ్బకి ఉద్యోగాలు ఉంటాయో ఉడుతావో తెలియని పరిస్థితుల్లోనూ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్. ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్‌, క్లౌడ్ స్పేస్ లో 1500 కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు ఫ్లాన్ చేసింది. ఇందుకోసం 75 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డితో 5,23,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో జార్జియాలోని అట్లాంటాలో కొత్త కార్యాల‌యం రూపుదిద్దుకోనున్న‌ట్లు సంస్థ ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఏడాదిక‌ల్లా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తోంది. జార్జియాలో మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గ‌జం పెట్టుబ‌డులు పెట్ట‌డం అభినందనీయం అన్నారు ఆ రాష్ర్ట గవ‌ర్న‌ర్ బ్రియ‌న్. వ్యాపార, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు.

టెక్ కంపెనీ సంస్థ‌ల‌కు కేంద్ర‌మైన అట్లాంటాలో సంస్థ సేవలను విస్తరించడం సంతోషంగా ఉందన్నారు మైక్రోసాఫ్ట్ జనరల్ మేనేజర్ టెర్రెల్ కాక్స్. తద్వారా ఇత‌ర ప్రాంతాల‌కు తమ వాణిజ్యాన్ని విస్త‌రించడంతో సంస్థ‌కి సాంకేతికంగా, ఆర్థికంగా మ‌రింత లాభం చేకూరుతుందన్నారు. ఇక క‌రోనా ప్రభావ సమయంలోనూ మైక్రోసాఫ్ట్ మూడ‌వ త్రైమాసికంలో భారీ లాభాల‌ను సాధించిన‌ట్లు సంస్థ గతంలోనే ప్ర‌క‌టించింది.