Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. నెల రోజుల్లో బంగారం ధర ఎంత తగ్గిందో తెలిస్తే షాకవుతారు!

Gold, Silver Prices: అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీనివల్ల పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రమాదం తగ్గింది. ఫలితంగా పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి "సురక్షితమైన" పెట్టుబడుల నుండి తమ డబ్బును ఉపసంహరించుకున్నారు. ఫెడరల్ రిజర్వ్ ఈ సంవత్సరం..

Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. నెల రోజుల్లో బంగారం ధర ఎంత తగ్గిందో తెలిస్తే షాకవుతారు!
Gold And Silver Prices

Updated on: Jun 26, 2026 | 3:22 PM

Gold, Silver Prices: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో తగ్గుముఖం పడుతున్నాయి. గత నెల రోజులుగా బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. నెల రోజుల కిందట అంటే మే 26వ తేదీన తులం బంగారం ధర రూ.1,60,000 వరకు ఉండగా, ప్రస్తుతం జూన్‌ 26న 1,41,600 వద్ద కొనసాగుతుంది. అంటే నెల రోజుల్లో రూ.18,400 వరకు దిగి వచ్చింది. ఇక సిల్వర్‌ విషయానికొస్తే.. కిలో వెండి ధర రూ.2,85,000 వద్ద కొనసాగుతుండగా, ప్రస్తుతం రూ.2,35000 వద్ద కొనసాగుతోంది. అంటే కేవలం నెల రోజుల్లోనే రూ.50 వేల వరకు తగ్గింది.

ఈ ఏడాది బంగారం, వెండి ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 2025 డిసెంబర్ 31న బంగారం ధర రూ.1.33 లక్షలు ఉండగా, అది 2026 జనవరి 29న రూ.1.76 లక్షల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత నుంచి బంగారం ధర రూ.36,000 మేర తగ్గింది. ఇదిలా ఉండగా, 2025 డిసెంబర్ 31న వెండి ధర రూ.2.30 లక్షలు ఉండగా, 2026 జనవరి 29 నాటికి అది రూ.3.86 లక్షలకు చేరుకుంది. వెండికి ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధర ఇదే. అప్పటి నుండి 147 రోజుల్లో వెండి ధర రూ.1.69 లక్షలు తగ్గింది.

అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీనివల్ల పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రమాదం తగ్గింది. ఫలితంగా పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి “సురక్షితమైన” పెట్టుబడుల నుండి తమ డబ్బును ఉపసంహరించుకున్నారు. ఫెడరల్ రిజర్వ్ ఈ సంవత్సరం వడ్డీ రేట్లను తగ్గించడం కంటే పెంచవచ్చని ఇటీవల సూచించింది. అధిక వడ్డీ రేట్ల అంచనాలు బంగారం వంటి వడ్డీ లేని లోహాల ఆకర్షణను తగ్గించే అవకాశం ఉంది. ఫెడరల్ రిజర్వ్ నుండి వచ్చిన సంకేతాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో యూఎస్ డాలర్ సూచీ బలపడింది. సాధారణంగా డాలర్ బలపడినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us