ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించనున్న బడ్జెట్‌పై మార్కెట్ నిపుణులు పలు అంచనాల వేస్తున్నారు. ఓ వైపు ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్ పెద్దగా ప్రకటనలూ ఏమీ ఉండవని పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ప్రభుత్వ వ్యయంపై దృష్టి సారిస్తుందని వివరించారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చే బడ్జెట్ కాబట్టి అంచనాలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి మే 2024 వరకు నిర్వహించే లోక్‌సభ ఎన్నికల కోసం భారతదేశం సన్నద్ధమవుతున్నందున రాబోయే బడ్జెట్ మరింత మధ్యంతర స్వభావంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇంటెర్మ్ బడ్జెట్‌పై నిపుణులు ఎలాంటి అంచనాలు వేస్తున్నారో? ఓ సారి తెలుసుకుందాం.
- ప్రభుత్వం సంక్షేమ వ్యయాన్ని పెంచడానికి సిద్ధంగా ఉందని నిపుణులు వాదిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఆర్థిక లోటును జీడీపీలో 4.5 శాతాని కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సంక్షేమ వ్యయాన్ని పెంచుతుందంటున్నారు. అంతేకాకుండా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్య లోటును జీడీపీలో 4.5 శాతానికి తగ్గించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
- ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పన్నులను తగ్గించే అవకాశం ఉందని కొంత మంది చెబుతున్నారు. వ్యవసాయంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు మద్దతునిచ్చే ప్రణాళికలను ప్రకటించాలని ప్రజలు ఆశిస్తున్నారని పేర్కొంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయం ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు వంటి తక్షణ సవాళ్లను ఎదుర్కొంటుంది. ప్రపంచ వృద్ధి ఆందోళనలను అధిగమించడానికి క్యాపెక్స్‌పై ప్రభుత్వ వ్యయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
- డిజిటలైజ్డ్ ఇండియా, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ), బ్రాడ్‌బ్యాండ్ వృద్ధిని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించి, అవస్థాపన విభాగానికి ఎక్కువ నిధులు కేటాయించాలని భావిస్తున్నారు.
- రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆహారం, ఎరువుల సబ్సిడీల కోసం భారతదేశం దాదాపు రూ. 4 ట్రిలియన్లు కేటాయించాలని ఆలోచిస్తోంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ 2025 ఆర్థిక సంవత్సరం కోసం 26.52 బిలియన్ల ఆహార సబ్సిడీ వ్యయాన్ని అంచనా వేసింది. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో ఊహించిన దాదాపు 24.11 బిలియన్ల నుంచి 10 శాతం పెరుగుదలను సూచిస్తుంది
- గృహా నిర్మాణాల కోసం ప్రభుత్వం అందించే డబ్బును (నిధులు) 15 శాతం కంటే ఎక్కువ పెంచవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పెరుగుదల 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గృహాల కోసం మొత్తం డబ్బును రూ. 1 ట్రిలియన్‌కు చేరుకునే అవకాశం ఉంది.
- డివెస్ట్‌మెంట్ ద్వారా రూ. 510 బిలియన్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆస్తులు లేదా పెట్టుబడులలో కొంత భాగాన్ని విక్రయించడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి