Gold: బంగారం ఈ రాష్ట్రంలో మరీ ఇంత చౌకా.. దేశంలోనే బంగారం నిల్వల్లో టాప్.. ఎక్కడుందో తెలుసా?

బంగారం నిల్వలలో భారతదేశంలోని ఓ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాదు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ బంగారం ధరలు మరీ చౌక. అందుకే ఈ రాష్ట్రంలో ప్రజలు బంగారాన్ని అధికంగా నిల్వచేస్తుంటారు. దీంతో ఆ ఎఫెక్ట్ రాష్ట్రాన్ని కూడా ఈ రేసులో ముందంజలో ఉంచింది. భారత్ లో మరే రాష్ట్రంలో లేనన్ని బంగారం నిల్వలు ఇక్కడే ఉన్నాయి. మరి అది ఏ రాష్ట్రమో.. అక్కడ ఎంత బంగారం ఉందో మీకు తెలుసా? అయితే వెంటనే ఇది చదివేయండి.

Gold: బంగారం ఈ రాష్ట్రంలో మరీ ఇంత చౌకా.. దేశంలోనే బంగారం నిల్వల్లో టాప్.. ఎక్కడుందో తెలుసా?
Gold Rates Lowest Prices State In india

Edited By:

Updated on: Mar 13, 2025 | 8:30 PM

భారతదేశంలో బంగారం ధరలు రాష్ట్రాలు మరియు నగరాలను బట్టి మారుతూ ఉంటాయి. పన్నులు, దిగుమతి సుంకాలు, రవాణా ఖర్చులు మరియు స్థానిక డిమాండ్ వంటి అనేక కారణాలు బంగారం ఈ బంగారం ధరల వ్యత్యాసానికి కారణమవుతుంటాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా ఆయా ప్రాంతాలను బట్టి వాటి ధరల్లో మార్పును గమనించవచ్చు. అయితే పెరుగుతున్న బంగారం ధరలు పసిడి ప్రియులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పుడున్న రేట్లకు సామాన్యులైతే అసలే కొనలేని పరిస్థితి. కానీ, దేశంలోని ఓ రాష్ట్రంలో మాత్రం బంగారం ధరలు చాలా తక్కువ ఉన్నాయి. బంగారం నిల్వలు ఈ రాష్ట్రంలో ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. దీని గురించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అత్యధిక తలసరి బంగారం నిల్వలు ఉన్న రాష్ట్రంగా మన పొరుగు రాష్ట్రమైన కేరళ పేరుగాంచింది. కేరళ ప్రజలు తలసరి అత్యధిక బంగారం కలిగి ఉన్నారని అధ్యయనం చెబుతోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నుండి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, కేరళలో ప్రతి సంవత్సరం 200 నుండి 225 టన్నుల బంగారం అమ్ముడవుతోంది. నిజానికి, కేరళ రాష్ట్రం అనేక ఓడరేవులకు దగ్గరగా ఉండటం వల్ల ఎక్కువ బంగారాన్ని దిగుమతి చేసుకోవడం సులభం అవుతుంది. అదనంగా, రవాణా ఖర్చులు తక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ బంగారం విక్రేతలు అధిక పన్ను భారాన్ని ఎదుర్కోకపోవడం వల్ల కేరళలో అతి తక్కువ ధరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

కేరళలో ప్రజలు ఇంతగా బంగారం కలిగి ఉండటానికి కారణం అక్కడ బంగారం ధర తక్కువగా ఉండటమే అని చెబుతారు. కేరళలో బంగారం ధరలు గతంలో తక్కువగా అమ్ముడుపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది సమీపంలోని ఓడరేవుల ద్వారా బంగారాన్ని దిగుమతి చేసుకోవడం. ఇలా చేయడం వల్ల రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. మీడియా నివేదికల ప్రకారం, కేరళలో బంగారంపై పన్ను ఎగవేత కూడా జరుగుతోందని చెబుతున్నారు.

పన్ను ఎగవేత నుండి పొదుపు చేయడం వల్ల వారు వినియోగదారులకు తక్కువ ధరలకు బంగారాన్ని అందించగలుగుతున్నారని ఒక నివేదిక చెబుతోంది. ఫలితంగా, దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే కేరళలో బంగారం ధరలు గతంలో తక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉండగా, కేరళ తలసరి బంగారం నిల్వలు భారతదేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక ప్రకారం, కేరళ వార్షిక బంగారం అవసరం 200-225 టన్నులు. కేరళ ప్రజల్లో బంగారం పట్ల మోహం ఎంత లోతుగా పాతుకుపోయిందో ఇది రుజువు చేస్తుంది.

కేరళ తర్వాత, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూడా బంగారం తక్కువ ధరలకు లభిస్తుంది. అయితే, బంగారం వాణిజ్యానికి కేంద్రంగా ఉన్న ఆర్థిక మరియు భౌగోళిక వాతావరణం కారణంగా కేరళ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..