Gold Rate Today: పసిడి ప్రియులకు ఊరట..! భారీగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ్టి గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..

బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు కాస్త తగ్గినప్పటికీ కూడా పసిడి ప్రియులకు పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే..బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి పెరిగిన ధరల వల్ల చాలా ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. ఇక, బంగారం తో పాటు వెండి కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. వెండి ధర చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఒక కేజీ ధర లక్షన్నర దాటి పరిగెడుతోంది.

Gold Rate Today: పసిడి ప్రియులకు ఊరట..! భారీగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ్టి గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..
Gold

Updated on: Oct 03, 2025 | 7:06 AM

బంగారం ధర పెరుగుదల ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. దసరా వంటి పండుగల సందర్భంగా ప్రజలు ఎల్లప్పుడూ బంగారం, వెండి ధరలపై ఆసక్తి చూపుతారు. అక్టోబర్ 3,శుక్రవారం బంగారం ధరలు కాస్త తగ్గాయి. ప్రధానంగా ప్రాఫిట్-బుకింగ్ కారణంగా. అదే సమయంలో వెండి ధర కూడా ఖరీదైనది. ఈ సమయంలో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు బంగారం, వెండి ధరలను నిశితంగా గమనిస్తున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం విషయంలో కనిపిస్తున్న ట్రెండ్‌ను పరిశీలిస్తే, దీపావళి నాటికి బంగారం ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

భారతదేశం – ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ.11,868, 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ.10,879లు ఉండగా, 18 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ.8,901లుగా ఉంది.

ప్రధాన నగరాల్లో 10గ్రాముల బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి..

– చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,09,490 ఉంది.

– ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,830 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,08,940 ఉంది.

– ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18, 680 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,08, 790 ఉంది.

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,680 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,08,790 ఉంది.

– విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,680 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,08,790 ఉంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,680 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,08,790 ఉంది.

బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు కాస్త తగ్గినప్పటికీ కూడా పసిడి ప్రియులకు పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే..బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి పెరిగిన ధరల వల్ల చాలా ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. ఇక, బంగారం తో పాటు వెండి కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. వెండి ధర చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఒక కేజీ ధర లక్షన్నర దాటి పరిగెడుతోంది. దేశంలో ఇవాళ్టి వెండి ధర విషయానికి వస్తే..ఒక గ్రాము రూ.164.10లు ఉండగా, వెండి కిలో ధర రూ. 1,64,100లుగా ఉంది.

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం