Gold, Silver Price Today: మళ్లీ దూకుడు.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. దేశంలో తాజా రేట్ల వివరాలు

|

May 08, 2022 | 6:27 AM

Gold, Silver Price Today: దేశంలో గత రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే తాజాగా ఆదివారం (మే 8)న బంగారం, వెండి ధరలు పెరిగాయి..

Gold, Silver Price Today: మళ్లీ దూకుడు.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. దేశంలో తాజా రేట్ల వివరాలు
Follow us on

Gold, Silver Price Today: దేశంలో గత రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే తాజాగా ఆదివారం (మే 8)న బంగారం, వెండి ధరలు పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధరపై రూ.330 వరకు పెరిగింది. ఇక వెండి కూడా స్వల్పంగా పెరిగింది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు. బంగారం, వెండి ధరలు పెరిగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,710 వద్ద ఉంది.

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 ఉంది.

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,770 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,200 వద్ద ఉంది.

☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద కొనసాగుతోంది.

☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద ఉంది.

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 ఉంది.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,380 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 ఉంది.

☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద ఉంది.

వెండి ధరలు..

ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. కిలో సిల్వర్‌ ధరపై స్వల్పంగా పెరిగింది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,800 ఉండగా, విజయవాడలో రూ.66,800 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.66,800 ఉండగా, ముంబైలో రూ.62,500 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.62,500 ఉండగా, కోల్‌కతాలో రూ.62,500 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.66,800 ఉండగా, కేరళలో రూ.66,800 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Nitin Gadkari: దేశంలో భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య.. వచ్చే రెండేళ్లలో ఎన్నంటే..?

India Post Payments Bank: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ డోర్‌స్టెప్‌ సేవలు.. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోండిలా..!