Latest Gold Silver Prices: మార్కెట్లో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి బులియన్ మార్కెట్లో (Bullion Market) పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటుంటాయి. తాజాగా ఆదివారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.49,000 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,450 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.300, 24 క్యారెట్లపై రూ.330 మేర తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ.66,000 గా ఉంది. రూ.500 మేర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,600 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.66,600 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.71,600 ఉంది. బెంగళూరులో రూ.71,600, కేరళలో రూ.71,600 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,600, విజయవాడలో రూ.71,600, విశాఖపట్నంలో రూ.71,600 లుగా కొనసాగుతోంది.
కాగా.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. జాతీయ, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
Also Read: