
దీపావళి పండక్కి ముందురోజే పసిడి ధరలు పతనమయ్యాయి. ధంతేరస్ సందర్బంగా నవంబర్ 6వ తేదీన శుక్రవారం గోల్డ్ రేట్లు పడిపోగా.. శనివారం కూడా అదే తగ్గుదల కొనసాగింది. దీపావళికి ముందు రోజే ఇవాళ కూడా గోల్డ్ రేట్లు క్రాష్ అయ్యాయి. పండుగ వేళ ధరలు పడిపోవడం పెద్ద ఊరటగా చెప్పవచ్చు. అంతర్జాతీయంగా పరిణామాల్లో మార్పుల వల్ల ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ భారీ ఓటమి తర్వాత అంతర్జాతీయంగా పరిణామాలు మారుతున్నాయి. ఇరాన్‌తో యుద్దాన్ని ట్రంప్ ముగిసే అవకాశముందని, శాంతి ఒఫ్పందం దిశగా అడుగులు పడొచ్చనే వార్తలు బలపడుతున్నాయి. దీంతో ఉద్రిక్తతలు తగ్గితే అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరా మరింత మెరుగుపడనుంది. దీని వల్ల ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ కారణంతో పసిడి ధరల్లో భారీ ఒడిదొడుకులు నమోదవుతున్నాయి. నవంబర్ 7వ తేదీన దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
– దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,450 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,490గా ట్రేడవుతోంది.
-హైదరాబాద్ బహిరంగ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,450 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,490 వద్ద ట్రేడవుతోంది.
-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,450 పలుకుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,490 వద్ద కొనసాగుతోంది.
-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,600కు లభిస్తోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,640 వద్ద ట్రేడవుతోంది.
-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,450గా ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,490కు లభిస్తోంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,450 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,490గా కొనసాగుతోంది.
-ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,04,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ రేటు రూ.2,05,000 వద్ద స్థిరపడింది
-హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2,04,900 వద్ద ట్రేడవుతోంది
-చెన్నైలో కేజీ వెండి ధర రూ..2,04,900 పలుకుతోంది.
-బెంగళూరులో కేజీ వెండి ధర రూ..2,04,900 వద్ద కొనసాగుతోంది