Gold Prices: గోల్డ్ లవర్స్‌కు పెద్ద ఊరట.. శాంతించిన పసిడి.. ఆదివారం తులం ఎంతంటే..?

బంగారం ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. శనివారం కూడా ధరలు పెరగ్గా.. ఆదివారం స్ధిరంగా ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ క్రమంలో బంగారానికి బాగా డిమాండ్ పెరిగింది. కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయి.

Gold Prices: గోల్డ్ లవర్స్‌కు పెద్ద ఊరట.. శాంతించిన పసిడి.. ఆదివారం తులం ఎంతంటే..?
Gold Prices

Updated on: Nov 29, 2026 | 6:51 AM

బంగారం ధరలు ఇటీవల రోజురోజుకూ మారుతూ సామాన్యులను, కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రత్యేకించి పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి ధరలు కొద్దిరోజులుగా పెరుగుతుండటంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. గత ఐదు రోజులుగా ధరలు పెరుగుతుండగా.. ఆదివారం కాస్త శాంతించాయి. దీంతో కొనుగోలుదారులకు పెద్ద ఊరట లభించింది. నవంబర్ 29వ తేదీన గోల్డ్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.

బంగారం ధరలు ఇవే..

– హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,860 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,17,200గా ట్రేడవుతోంది.

– విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,860 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,17,200 వద్ద ట్రేడవుతోంది.

– దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,28,010 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,17,350గా కొనసాగుతోంది.

– చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,27,860 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,17,200గా కొనసాగుతోంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,860గా కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,17,200 వద్ద ట్రేడవుతోంది.

వెండి రేట్లు ఇవే..

– దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1.70 లక్షల వద్ద కొనసాగుతోంది.

– హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.1.70 లక్షలుగా ఉంది.

– చెన్నైలో కిలో వెండి ధర రూ.1.70 లక్షల వద్ద ట్రేడవుతోంది.

గత వారం రోజుల్లో ధర ఎలా ఉందంటే..?

నవంబర్ 23వ తేదీన హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,25,070గా ఉండగా.. 29వ తేదీ నాటికి రూ.1,27,860కు చేరుకుంది. అంటే రూ.2790 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు 23న రూ.1,14,640గా ఉండగా.. 29 తేదీన రూ.1,17,200 వద్ద కొనసాగుతోంది. అంటే రూ.2560 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 23న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,25,220గా ఉండగా.. 29వ తేదీ నాటికి రూ.1,28,010 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల రేటు 23వ తేదీన రూ.1,14,790 వద్ద ఉండగా.. 29వ తేదీ నాటికి రూ.1,17,350కి చేరుకుంది. అటు నవంబర్ 23వ తేదీన కిలో వెండి ధర రూ.1.75 లక్షల వద్ద ఉండగా.. నవంబర్ 29న రూ.1.70 లక్షల వద్ద ట్రేడవుతోంది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us