Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధరలు.. తులం రేట్ ఇదే..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మరోసారి తగ్గాయి. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఇటు దేశంలోని పలు ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్, విజయవాడలోనూ బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకున్నారు. శుక్రవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధరలు.. తులం రేట్ ఇదే..

Updated on: May 02, 2025 | 7:07 AM

బంగారం కొనాలకుంటున్నారా.. ? అయితే మీకోసమే ఈ శుభవార్త. కొన్ని రోజుల క్రితం లక్షకు చేరిన బంగారం ధరలు ఇప్పుడు దిగివస్తున్నాయి. గత కొంతకాలంగా పరుగులు పెట్టిన పసిడి ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతుంది. ముఖ్యంగా గత వారం రోజులుగా బంగారం ధరలలో అంతగా పెరుగుదల కనిపించడం లేదు. దీంతో పసిడి కొనుగోలుపై ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపిస్తున్నారు సామాన్యులు. శుక్రవారం ఉదయం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న అంటే గురువారం 22 క్యారెట్ల పసిడి రూ.87,750 ఉండగా.. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.87,740 చేరింది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రూ.95,730 .. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,720 చేరింది. దీంతో అటు హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.

హైదరాబాద్‏లో బంగారం ధరలు..

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,740 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,720కు చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, నిజామాబాద్, వరంగల్ వంటి నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇక పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

  • ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,740, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,720కు చేరింది.
  • ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,890, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,587కు చేరింది.
  • చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.87,740 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.95,720వద్ద కొనసాగుతుంది.
  • కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,740, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.95,720కు చేరింది.
  • అలాగే బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.87,740 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.95,720కు చేరింది.
  • కేరళ, పూణె, వడోదర, అహ్మదాబాద్ వంటి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..