
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.. ఇటీవల తగ్గినట్లే తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు.. మళ్లీ భారీగా పెరుగుతుండటం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ ఘర్షణలు మొదలుకావడంతో గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా.. వారంలోనే బంగారం ధర రూ.3వేలకు పైగా పెరిగింది. తాజాగా కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా మంగళవారం (ఆగస్టు 18) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.10 మేర పెరిగి.. రూ.1,55,670 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.10 మేర పెరిగి రూ.1,42,710 గా ఉంది.
వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి రూ.2,49,900 లుగా కొనసాగుతోంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర రూ.1,55,670, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,710 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,55,670, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,42,710 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,55,820, 22 క్యారెట్ల ధర రూ.1,42,860 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,55,670, 22 క్యారెట్ల ధర రూ.1,42,710 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 లుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,55,670, 22 క్యారెట్ల ధర రూ.1,42,710 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,55,670, 22 క్యారెట్ల ధర రూ.1,42,710 ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 లుగా ఉంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.