
బంగారం, వెండి ధరలు రోజూ ఒకేలా ఉండవు. అంతర్జాతీయ మార్కెట్లలో జరిగే కొన్ని కీలక పరిణామాలు కారణంగా ఈ ధరలు నిరంతరం మారుతూ ఉంటాయి. అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ఈ మధ్యకాలంలో కాస్త తగ్గుముఖం పట్టి కొనుగోళు దారులకు స్వల్ప ఊరటను ఇచ్చాయి. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం, వెండిపనై సుంకాలను పెంచడంతో మరోసారి ఈ ధరలు ఆకాశాన్నంటాయి. ఒకేసారి భారీ మొత్తంలో పెరిగాయి. అయితే ఆ తర్వాత మళ్లీ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.
ఈ పరిణామాల తర్వాత శనివారం ఉదయం 6 గంటలకు దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,900 గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,740 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి ధరలు చూసుకుంటే దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,89,900 వద్ద కొనసాగుతుంది. శుక్రవారంతో పోల్చుకుంటే 24 క్యారెట్ల బంగారంపై రూ. 4,420 తగ్గగా, 22 క్యారెట్లపై రూ. 4,050 తగ్గింది. ఇక వెండి విషయానికి వస్తే నిన్నటితో పోల్చుకుంటే కేజీ వెండి ధర ఏకంగా రూ.10,000 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల సహా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
వెండి వివరాలు
ఇక దేశీయ మార్కెట్‌లో తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు చూసుకుంటే.. ఇది కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. నిన్నిటితో పోల్చుకుంటే ఇవాళ ఉదయం 6 గంటల వరకు కేజీ వెండి ధర రూ.10వేలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలలో కిలో వెండి ధర రూ.3,04,900 గా ఉంటే.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలలో కిలో వెండి ధర రూ.2,89,900 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.