Gold Prices: గోల్డ్ ప్రియులకు భారీ ఊరట.. స్థిరంగా కొనసాగుతున్న రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

బంగారం ధరలపై గుడ్ న్యూస్. అక్టోబర్ 11న ఆదివారం ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ధరలు ఒక్కసారిగా శాంతించాయి. దీంతో కొనుగోలు చేయాలనుకువారు ఊరట చెందుతున్ననారు. త్వరలో దసరా, దీపావళి పండుగలు రానున్న క్రమంలో బంగారం ధరలు ఎలా ఉంటాయనే చర్చ నడుస్తోంది.

Gold Prices: గోల్డ్ ప్రియులకు భారీ ఊరట.. స్థిరంగా కొనసాగుతున్న రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
Gold Prices

Updated on: Oct 11, 2026 | 6:41 AM

బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతుండగా.. ఆదివారం స్థిరంగా ఉన్నాయి. బతుకమ్మ పండుగ మొదలవ్వడం, దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన క్రమంలో బంగారం కొనేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో గోల్డ్ రేట్లు స్ధిరంగా ఉండటం ఉపశమనం కలిగించే అంశంగా చెప్పవచ్చు. గోల్డ్ కొనుగోలు చేయడానికి ఇదే మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య సంఘర్షణల క్రమంలో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీని కారణంగా ద్రవ్యోల్బణంపై ఒత్తిళ్లు పెరగడంతో ఫెడ్ ఇటీవల వడ్డీ రేట్లను పెంచింది. అయితే మరోసారి అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే బంగారం ధరలు మరింతగా తగ్గే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,420 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,800గా ట్రేడవుతోంది.

-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,420 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,800గా ట్రేడవుతోంది.

-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,51,420 వద్ద ప్రస్తుతం ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,38,800 వద్ద కొనసాగుతోంది.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,570 వద్ద ఇప్పుడు కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,950గా ట్రేడవుతోంది.

ఆదివారం సిల్వర్ రేట్లు ఇలా..

-దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.40 లక్షలుగా ఉంది.

-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2.45 లక్షలుగా ఉంది.

-చెన్నైలో కేజీ సిల్వర్ రేటు రూ.2.45 లక్షలుగా ఉంది.

-బెంగళూరులో కేజీ సిల్వర్ రేటు రూ.2.40 లక్షలుగా ఉంది.

 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us