Gold Price Today: రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులోనే ఎంత తగ్గిందో తెలిస్తే షాకవుతారు!

Gold, Silver Prices: అంతర్జాతీయ పరిణామాలతో పాటు మన దేశంలోనూ పసిడి సెంటిమెంట్‌ను దెబ్బతీసే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యవసరమైతే తప్ప అనవసరంగా గోల్డ్ కొనుగోలు చేయవద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీ పౌరులకు చేసిన విజ్ఞప్తి స్వదేశీ బులియన్ మార్కెట్‌లో కొత్త చర్చకు దారితీసింది..

Gold Price Today: రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులోనే ఎంత తగ్గిందో తెలిస్తే షాకవుతారు!
Today Gold Rate

Updated on: Sep 02, 2026 | 6:43 AM

Gold, Silver Prices Today: ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల పరుగులు పెట్టిన రెండు లోహాల ధరలు.. ఇప్పుడు గణనీయంగా తగ్గుముఖం పట్టడం కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చేలా ఉంది. అయితే తాజాగా సెప్టెంబర్‌ 2న బుధవారం ధరలను పరిశీలిస్తే తులం బంగారంపై భారీ స్థాయిలో దిగి వచ్చింది. నిన్న ఉదయం 10 గంటల సమయంలో తులం బంగారం ధర రూ.1,56,930 ఉండగా, ఇప్పుడు మాత్రం రూ.1,54,080 వద్ద కొనసాగుతోంది. అంటే ఒకే రోజు రూ.2,800పైగా తగ్గుముఖం పట్టింది. ఇక వెండి విషయానికొస్తే.. ఇది కూడా భారీగానే తగ్గుతోంది. గత వారంలో కిలో వెండి ధర రూ.2,60,000 ఉండగా, ప్రస్తుతం కిలో సిల్వర్‌ ధర రూ.2,49,900 వద్ద ట్రేడవుతోంది.

ఇది కూడా చదవండి: September New Rules: జేబులకు చిల్లులు పడే న్యూస్.. నేటి నుంచే మారిన గ్యాస్, కార్లు, ఆటో ఛార్జీల రేట్లు!

తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాలు

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,080 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,240 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,240 వద్ద ట్రేడవుతోంది.

ఇతర రాష్ట్రాల్లో..

  • ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,230 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,390 వద్ద ట్రేడవుతోంది.
  • ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,240 వద్ద ట్రేడవుతోంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,240 వద్ద ట్రేడవుతోంది.
  • కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,240 వద్ద ట్రేడవుతోంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,630 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,740 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ పరిణామాలతో పాటు మన దేశంలోనూ పసిడి సెంటిమెంట్‌ను దెబ్బతీసే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యవసరమైతే తప్ప అనవసరంగా గోల్డ్ కొనుగోలు చేయవద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీ పౌరులకు చేసిన విజ్ఞప్తి స్వదేశీ బులియన్ మార్కెట్‌లో కొత్త చర్చకు దారితీసింది. ఈ ప్రకటన అంతర్జాతీయ మార్కెట్‌ను నేరుగా ప్రభావితం చేయకపోయినా, రాబోయే పండుగల సీజన్‌లో భారత్‌లో ఆభరణాల డిమాండ్‌పై కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు.

ఇదికూడా చదవండి: New Car Buying: కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు ‘బెస్ట్ టైమ్’ ఇదే.. అస్సలు మిస్సవ్వకండి

ఇది కూడా చదవండి: AI App: కోడింగ్ రాకపోయినా AI యాప్ తయారీ.. 3 రోజుల్లో 2.5 లక్షలు సంపాదించిన 13 ఏళ్ల చిన్నారి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us