Gold Rates: వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..? కొనడం కష్టమే..

దేశంలో పండుగల సీజన్ క్రమంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. గత వారంలో భారీగా పుంజుకున్నాయి. అటు బంగారంతో పాలిస్తే వెండి ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, డాలర్ బలపడటం ధరల పెరుగుదలకు కారణమవుతోంది. గత వారంలో వివిధ ప్రాంతాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold Rates: వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..? కొనడం కష్టమే..
Gold Rates

Updated on: Oct 11, 2026 | 11:11 AM

వారం రోజుల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత వారంలో భారీ పెరుగుదలను నమోదు చేశాయి. అంతకముందు వారం ధరలు తగ్గగా.. గత వారంలో స్వల్ప పెరిగాయి. పండుగల సీజన్ క్రమంలో డిమాండ్ పెరగడం, అంతర్జాతీయంగా ఘర్షణల క్రమంలో ధరలు పెరుగుతూ వస్తోన్నాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. గత వారంలో అక్టోబర్ 5 నుంచి 11వ తేదీ వరకు దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు గురించి ఇందులో చూద్దాం.

వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందంటే..?

అక్టోబర్ 5న సోమవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,180 వద్ద ఉండగా.. అక్టోబర్ 11 ఆదివారం నాటికి రూ.1,51,420కి చేరుకున్నాయి. అంటే వారం రోజుల్లో రూ.2240 పెరిగాయి. ఇక అక్టోబర్ 5న హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,750 వద్ద ఉండగా.. 11వ తేదీ నాటికి రూ.1,38,800 వద్ద ట్రేడవుతున్నాయి. అంటే వారం రోజుల్లో రూ.2050 మేర పెరిగాయి. ఇక అక్టోబర్ 5న దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,49,330 వద్ద ఉండగా.. 11వ తేదీన రూ.1,51,570 వద్ద కొనసాగుతున్నాయి. గత వారంలో రూ.2240 పెరిగాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ. రూ.1,36,800 నుంచి రూ.1,38,950కి చేరుకుంది.

సిల్వర్ ధరలు చూస్తే..

అక్టోబర్ 5వ తేదీన హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.45 లక్షల వద్ద ప్రారంభమవ్వగా.. అక్టోబర్ 11న కూడా అదే ధర కొనసాగుతోంది. అంటే వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి.  ఇక అక్టోబర్ 5న ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.35 లక్షల వద్ద ఉండగా..  అక్టోబర్ 11న రూ.2.40 లక్షల వద్ద ట్రేడవుతోంది.

బంగారం ధరల పెరుగుదలకు కారణాలివే..?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణంపై ఒత్తిడి నెలకొనడంతో ప్రపంచ బంగారం ధరలపై ప్రభావం పడుతోంది. అనిశ్చిత సమయాల్లో పెట్టుబడిదారులు తరచుగా బంగారం వైపు మొగ్గుచూపుతారు. దీంతో ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. సురక్షిత ఆస్తిగా పేరుగాంచిన బంగారం.. సంఘర్షణలు ప్రపంచ ఆర్థిక స్థిరత్వంపై ఆందోళనలను సృష్టించినప్పుడు కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. కానీ సంక్షోభ సమయంలో బంగారం ధర ఎల్లప్పుడూ పైకి కదలదు. అక్టోబర్ 7న అమెరికన్ డాలర్ బలపడటం, ట్రెజరీ ఈల్డ్స్ పెరగడంతో అంతర్జాతీయ బంగారం ధరలు పడిపోయాయి. ఆ తర్వాత మార్కెట్ పరిస్థితులు మారడంతో ధరలు  మళ్లీ పుంజుకున్నాయి. 

Loading...
Unable to load recommendations.
Follow Us