Gold Price Today: బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే..

Gold, Silver Prices: దేశంలో బంగారం, వెండి ధరలు ప్రతి రోజు హెచ్చు తగ్గులకు గురవుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి..

Gold Price Today: బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే..
Gold Price

Updated on: Jun 04, 2026 | 6:25 AM

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. ఇటీవల పరుగులు పెట్టిన రెండు లోహాల ధరలు.. క్రమంగా దిగి వస్తున్నాయి. తాజాగా జూన్‌ 4వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,190 వద్ద ట్రేడవుతోంది. విజయవాడలో కూడా ఇదే ధరతో కొనసాగుతోంది.
  2. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,360 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,340 వద్ద ట్రేడవుతోంది.
  3. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,190 వద్ద ట్రేడవుతోంది.
  4. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,190 వద్ద ట్రేడవుతోంది.
  5. ఇవి కూడా చదవండి
  6. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,990 వద్ద ట్రేడవుతోంది.
  7. ఇక వెండి ధర విషయానికొస్తే హైదరాబాద్‌, విజయవాడ, చెన్నైలో కిలో ధర రూ.2,89,900 వద్ద కొనసాగుతుండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో రూ.2,79,900 వద్ద ట్రేడవుతోంది.

ఇక కేంద్ర ప్రభుత్వం వెండి దిగుమతుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వెండికి రికార్డు స్థాయిలో పెరుగుతున్న డిమాండ్, దిగుమతులకు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఒక కీలకమైన చర్య తీసుకుంది. వెండి దిగుమతులను నియంత్రించడానికి నిబంధనలను కఠినతరం చేశారు. కొత్త నిబంధనల ప్రకారం, వెండి రేణువులు, పొడి, ఇతర రూపాలు, 99.9% స్వచ్ఛత కలిగిన వెండి ఉత్పత్తులను నియంత్రిత వర్గంలో చేర్చారు. దిగుమతిదారులు ఇకపై వెండిని దిగుమతి చేసుకోవడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) నుండి ముందస్తు అనుమతి పొందవలసి ఉంటుంది.

గత నెలలో వెండి కడ్డీలు, పాక్షికంగా తయారైన వెండి ఉత్పత్తులపై విధించిన ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న వెండి దిగుమతులను అరికట్టడం, దేశీయ కరెన్సీ (రూపాయి)పై ఒత్తిడిని తగ్గించడం, అధిక ముడిచమురు ధరల నేపథ్యంలో దేశ విదేశీ మారక నిల్వలను పరిరక్షించడం ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us