
బంగారం ధరలు నాన్ స్టాప్‌గా పెరుగుతున్నాయి.. ఇటీవల తగ్గి కాస్త ఊరటనిచ్చిన పసిడి ధరలు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే.. రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు.. బుధవారం తులంపై రూ.900ల వరకు పెరిగాయి.. తాజాగా పసిడి ధరలు పెరిగాయి.. అయితే.. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా గురువారం (సెప్టెంబర్ 24) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల గోల్డ్ పై రూ.10 మేర పెరిగి ధర రూ.1,54,210 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధరపై రూ.10 పెరిగి.. రూ.1,41,360 గా ఉంది.
వెండి కిలో ధరపై రూ.100 తగ్గి.. రూ.2,49,900 గా కొనసాగుతోంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.