బంగారం అంటే భారతీయులకు.. అందులోనూ మహిళలకు మహా ఇష్టం. భారతీయ ప్రజల్లో బంగారానికి అత్యున్నత స్థానం ఉంటుంది. ఎంతో కొంత తమ వద్ద బంగారం ఉండాలని కోరుకుంటారు. ఒకప్పుడు అలంకారానికి మాత్రమే వినియోగించి పసిడి ప్రస్తుతం ఒక పెట్టుబడి సాధనంగానూ మారిపోయింది. దీంతో బంగారం కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో డిమాండ్ పెరిగి బంగారం ధరలు కొన్నేళ్లలోనే పలు రేట్లు పెరిగిన విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ ధరలు పడిపోతుండడం ఇందుకు ఒక కారణంగా చెబుతున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ప్రతి రోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇక తాజాగా దేశీయంగా మే 28వ తేదీని ఆదివారం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,940 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040 వద్ద నమోదైంది.
➦ ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.60,600 వద్ద ఉంది.
➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.55,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,750 ఉంది.
➦ కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,600 ఉంది.
➦ బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,650 వద్ద కొనసాగుతోంది.
➦ హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,600 వద్ద కొనసాగుతోంది.
➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,600 వద్ద కొనసాగుతోంది.
➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,60 ఉంది.
కాగా, బంగారం ధర తగ్గుముఖం పడితే వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై కేవలం రూ.100 మాత్రమే పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
➦ చెన్నైలో కిలో వెండి ధర రూ.77,000, ముంబైలో రూ.73,000, ఢిల్లీలో రూ.73,000, కోల్కతాలో కిలో వెండి రూ.73,000, బెంగళూరులో రూ.77,000, హైదరాబాద్లో రూ.77,000, విశాఖలో రూ.77,000 వద్ద ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..