Gold Price Today: తగ్గేదేలే.. మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెరిగిందంటే..

|

Jan 24, 2023 | 6:27 AM

మార్కెట్‌లో కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఎన్నడులేనంతగా పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

Gold Price Today: తగ్గేదేలే.. మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెరిగిందంటే..
Gold Price
Follow us on

Gold Silver Price Today: మార్కెట్‌లో కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఎన్నడులేనంతగా పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తాజాగా, మార్కెట్‌లో బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.52,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,110 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.100 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.50 మేర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.72,300 లుగా కొనసాగుతోంది. తాజాగా పెరిగిన ధరల ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,270 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110 గా ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,230, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,070 గా కొనసాగుతోంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110 గా ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,160 గా ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110 గా ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,110 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110 ఉంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110 గా కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,300 లుగా ఉంది.
  • ముంబైలో కిలో వెండి ధర రూ.72,300
  • చెన్నైలో కిలో వెండి ధర రూ.74,700
  • బెంగళూరులో రూ.74,700
  • కేరళలో 74,700
  • కోల్‌కతాలో 72,300
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,700
  • విజయవాడలో రూ.74,700
  • విశాఖపట్నంలో రూ.74,700 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..