Gold Price Today: లక్షకు దిగివస్తున్న కనకం.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఏకంగా 5వేలకు పైగా..

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పతనం కావడంతో దేశీయ మార్కెట్లోనూ ధరలు దిగివచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.5,120 తగ్గగా, 22 క్యారెట్ల ధర రూ.4,700 పడిపోయింది. వెండి కిలో ధర కూడా రూ.5,000 తగ్గింది. నేటి తాజా ధరలు తెలుసుకోండి.

Gold Price Today: లక్షకు దిగివస్తున్న కనకం.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఏకంగా 5వేలకు పైగా..
Gold Silver Prices

Updated on: Nov 20, 2026 | 11:07 AM

వామ్మో.. బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి.. ఇక ఇప్పట్లో తగ్గే సీనే లేదు అనుకున్న వాళ్లందరికీ మార్కెట్ అదిరిపోయే సర్‌ప్రైజ్. పసిడి ధరలు ఒక్కసారిగా కిందికి దిగివస్తున్నాయి. ముఖ్యంగా 10 గ్రాముల గోల్డ్ మళ్లీ లక్ష రూపాయల మార్కు వైపు అడుగులు వేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి ఇంతలా ధరలు తగ్గడానికి కారణమేంటి? లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయి బంగారం ధరల్లో పతనం ఆగడం లేదు. వరుస పతనంతో 10 గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల మార్కు వైపు వేగంగా దిగివస్తోంది. మనదేశంలో ఇప్పటికే MCX మార్కెట్లో 10 గ్రాముల గోల్డ్‌ ధర లక్ష 25వేల 570 రూపాయలకు చేరింది.గత రాత్రి గ్లోబల్ మార్కెట్లో పసిడి ధర ఏకంగా 3.5 శాతం మేర భారీగా పడిపోయింది. ప్రస్తుతం ఒక ఔన్స్ గోల్డ్ ధర 3వేల 553 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. అమెరికన్ డాలర్ అంతకంతకూ బలపడుతుండటంతో బంగారం ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న ఈ భారీ తగ్గుదల ప్రభావం ఇవాళ మన దేశీయ బులియన్ మార్కెట్లోనూ స్పష్టంగా కనిపించనుంది. బంగారాన్ని మించి వెండిధరలు పతనం అవుతోన్నాయి.. అంతర్జాతీయంగా 41 డాలర్ల ట్రేడవుతోన్న సిల్వర్‌.. ఒక్కరోజే 7 శాతం పతనమైంది.. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం గోల్డ్ షాపింగ్ చేయాలనుకునే వారికి నిజంగానే ఊరటనిచ్చే వార్త!.. తులం 24క్యారెట్ల బంగారం పై ఏకంగా రూ.5వేలకు పైగా ధర తగ్గింది.

దేశియంగా బంగారం, వెండి ధరలు..

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.5,120 తగ్గి.. రూ.1,25,570 గా ఉంది.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.4,700 తగ్గి.. రూ.1,15,100 గా ఉంది.

వెండి కిలోపై ఏకంగా 5000 తగ్గి.. రూ.1,75000లకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి.. అయితే.. ప్రాంతాల వారీగా.. రేట్లలో వ్యత్యాసం ఉంటుంది.

హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,570, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,100 గా ఉంది..

ఇంకా పతనం..

అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ అంతకంతకూ బలపడుతుండటమే బంగారం ధరల పతనానికి ప్రధాన కారణంగా మారింది. డాలర్ పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులను తగ్గించుకుంటున్నారు. దీని ప్రభావం నేరుగా మన దేశీయ మార్కెట్లపై పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో 3.5 శాతం మేర ధర తగ్గిన ప్రభావంతో, ఇవాళ మన బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరింత భారీగా పడిపోయే ఛాన్స్ ఉంది. ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగానే శుభవార్త. ఈ తగ్గుదల ఇలాగే కొనసాగితే త్వరలోనే 10 గ్రాముల బంగారం లక్ష రూపాయల మార్కును తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇవాళ మార్కెట్ ముగిసే సమయానికి రేట్లు ఎంతవరకు తగ్గుతాయో చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us