Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. స్థిరంగానే బంగారం ధరలు.. కొన్ని ప్రాంతాల్లో..

|

Feb 02, 2022 | 6:12 AM

Gold Rate Today: మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. కొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. అందుకే వినియోగదారులంతా వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు.

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. స్థిరంగానే బంగారం ధరలు.. కొన్ని ప్రాంతాల్లో..
Gold Price Today
Follow us on

Latest Gold Price: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. కొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. అందుకే వినియోగదారులంతా వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. అయితే.. కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ షాకిచ్చాయి. ఈ క్రమంలో పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడింది. మంగళవారం తగ్గిన ధరలు.. బుధవారం స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.44,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,980 గా ఉంది. 24 క్యారెట్ల బంగారంపై ధరలు స్వల్పంగా తగ్గాయి. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980 వద్ద ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,980 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,320 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,440 వద్ద కొనసాగుతోంది.
* పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980 ఉంది.
* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,980 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980 వద్ద కొనసాగుతోంది.
* ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980 ఉంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980 గా ఉంది.

Also Read:

Raisins Side effects: ఎండుద్రాక్ష ఎక్కువగా తింటున్నారా? ఈ ప్రమాదం గురించి తప్పక తెలుసుకోవాల్సిందే..

Telugu States MPs Reactions: కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన తెలుగు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు..!