Latest Gold Price: బులియన్ మార్కెట్‌లో నిత్యం బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. అందుకే వినియోగదారులంతా వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. అయితే.. కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ.. పసిడి ప్రియులకు షాకిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.47,590 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 49,590 గా ఉంది. తులం బంగారంపై రూ.430 మేర పెరిగింది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040 వద్ద ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,590 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,000 వద్ద కొనసాగుతోంది.
* పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,500 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 ఉంది.
* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,700 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 వద్ద కొనసాగుతోంది.
* ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 ఉంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 వద్ద కొనసాగుతోంది.
Also Read: