
Gold Price Today: ఆగస్టు చివరి వారంలో బంగారం ధరలు గరిష్ఠాల నుంచి దిగొచ్చింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠిన వైఖరి, డాలర్, బాండ్ ఈల్డ్స్ బలపడటం, లాభాల స్వీకరణతో పసిడి అమ్మకాలు తగ్గాయి. ఆగస్టు 31 నుంచి ప్రారంభమయ్యే వారంలో బంగారం ధరలు ఏ దిశగా కదులుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజాగా ధరలను చూస్తే తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,760 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,690 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే..2,59,900 వద్ద ట్రేడవుతోంది.
ఇక పసిడి ధరల పరుగుకు ఆగస్టు చివరి వారంలో బ్రేక్ పడింది. వరుసగా పెరిగి నెల గరిష్ఠాలకు చేరిన బంగారం.. వారం చివర్లో ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠిన వైఖరి, వడ్డీరేట్లపై మారిన అంచనాలు, డాలర్, అమెరికా బాండ్ ఈల్డ్స్ బలపడటం, భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో పసిడిపై ప్రభావం చూపించాయి. అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ కూడా గణనీయంగా తగ్గడంతో దేశీయ మార్కెట్‌లోనూ ప్రతికూల ప్రభావం కనిపించింది. దీంతో ఇప్పుడు అందరి చూపు ఆగస్టు 31 నుంచి ప్రారంభమయ్యే కొత్త వారంపైనే ఉంది. మరి పసిడి మళ్లీ పరుగులు తీస్తుందా..? లేక మరింత నేలచూపులు చూస్తుందా..? అనేది ఆసక్తికరంగా ఉంది.