Gold Price Today: బాబోయ్‌ మళ్లీ బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఇక కొనడం కష్టమే..!

Gold, Silver Price Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. గత మూడు , నాలుగు రోజు కిందటి నుంచి భారీ స్థాయిలో ఎగబాకుతున్నాయి. ఇటీవల కాలం నుంచి ధరలు భారీగా తగ్గడంతో కొనగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ నాలుగు రోజుల కిందట కేంద్రం సుంకం పెంచడంతో మళ్లీ ధరలు పరుగులు పెడుతున్నాయి..

Gold Price Today: బాబోయ్‌ మళ్లీ బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఇక కొనడం కష్టమే..!
Today Gold Price

Updated on: May 15, 2026 | 6:27 AM

Gold, Silver Price Today: పెళ్లిళ్లల్లో బంగారం నగలు తప్పనిసరి. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే కొనే పరిస్థితి కనిపించడం లేదు. క్రమంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. ఆకాశాన్ని తాగేలా ధరలు ఎగబాకుతున్నాయి. వెండి పరిస్థితి కూడా అంతే తగ్గేదేలే అన్నట్లు పరుగులు పెడుతోంది. అయితే ప్రస్తుతం ధరలను చూస్తే బంగారం కొనడం అనేది అందరికి సాధ్యం కాకపోవచ్చు. మధ్య తరగతి ప్రజలకు పెను భారంగా మారుతోంది. బంగారం ధరలతో బెంబేలెత్తిపోతున్న మగువలు రోల్డ్‌ గోల్డ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నగలూ అచ్చం బంగారంతో చేసినట్లుగానే ఉంటున్నాయి.

గత మూడు రోజుల కిందట ధరలను చూస్తే తులంపై భారీగా పెరిగింది. 10 గ్రాములపై ఏకంగా రూ.13 వేలకుపైగా ఎగబాకింది. అంతేకాకుం వెండి కూడా కిలోపై ఏకంగా రూ. 20 వేలకుపైగా ఎగబాకింది. ప్రస్తుతం అంటే మే 15వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు భారీగానే ఉన్నాయి. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,810 ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  1. హైదరాబాద్‌, విజయవాడ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,340 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,810.
  2. ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,270 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,960 ఉంది.
  3. ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,810 ఉంది.
  4. చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,190 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,510 ఉంది.
  5. బెంగళూరు: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,810 ఉంది.
  6. కోల్‌కతా: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,810 ఉంది.

ఇక వెండి ధరలు:

హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, కేరళలలో కిలో వెండి ధర ఇతర ప్రాంతాలకంటే కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ రూ.3,14,900 వద్ద ట్రేడవుతోంది. అదే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలలో కిలో వెండి ధర రూ.2,99,900 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us