Telugu News Business Gold Price Today: Gold and Silver Rates in Hyderabad, Delhi, Mumbai, Chennai and other cities on April 26th
Gold Price Today: శాంతించిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
Gold, Silver Prices: ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువలో మార్పులు మరియు భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం పసిడి ధరలపై పడుతోంది. పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇక జీఎస్టీ (GST), మేకింగ్ ఛార్జీలు..
Gold, Silver Price Today: గారం ధరలు గత వారం రోజుల్లో ఒకటి, రెండు సార్లు మాత్రమే పెరిగింది. తర్వాత దిగి వస్తోంది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు అటువైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడు ఏప్రిల్ 26న పసిడి ధరలు ప్రస్తుతం స్థిరంగానే కొనసాగుతున్నాయి. దేశీయంగా ఇలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం భారీగా హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. తాజాగా కూడా ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
హైదరాబాద్‌లో24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,040 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,200.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,040 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,200.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,190 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,350.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,040 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,200.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,910 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,200.
కోల్‌కాతలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,040 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,200.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,040 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,200.
కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,040 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,200.
వెండి ధరలు
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,70,000
విజయవాడలో కిలో వెండి ధర రూ.2,70,000
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,60,000
ముంబైలో కిలో వెండి ధర రూ.2,60,000
బెంగళూరులో కిలో వెండి ధర రూ.2,60,000
ధరల్లో మార్పులకు కారణాలు:
అంతర్జాతీయ మార్కెట్: ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువలో మార్పులు మరియు భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం పసిడి ధరలపై పడుతోంది. పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇక జీఎస్టీ (GST), మేకింగ్ ఛార్జీలు, రాష్ట్రాల వారీగా ఉండే రవాణా ఖర్చుల వల్ల నగరాల మధ్య ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయి.