
Gold, Silver Price Today: బంగారం, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. ధరలను చూస్తుంటే ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేనట్లుగా కనిపిస్తున్నాయి. రానున్న రోజులలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నిన్న ఒక్క రోజే 800 రూపాయలకుపైగా పెరిగింది. గత రెండు, మూడు రోజులుగా ధరలను చూస్తే.. దాదాపు రూ.3 వేలకుపైగానే పెరిగింది. ఇక వెండి విషయానికొస్తే.. ఇది కూడా భారీ స్థాయిలో పరుగులు పెడుతోంది. గత ఆదివారం అంటే డిసెంబర్ 7వ తేదీన కిలో వెండి ధర లక్షా 90వేల రూపాయలు ఉంది.
కానీ ఇప్పుడు రూ.2లక్షల 4100 వద్ద కొనసాగుతోంది. అంటే వారం రోజుల్లోనే దాదాపు 14 వేలకుపైగా పెరిగింది. దీన్ని బట్టి చూస్తే సిల్వర్ ఎంత పరుగులు పెడుతుందో అర్థమైపోతుంది. బంగారం కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతోంది. ఇక డిసెంబర్ 12న ఉదయం 6 గంటల సమయానికి ధరలను చూస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,180 ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,23,000 వద్ద కొనసాగుతోంది.
ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి