ప్రతి రోజు బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా జనవరి 10వ తేదీన దేశంలోని బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 తగ్గగా, 24 క్యారెట్ల 10 గ్రాములపై అంతే మొత్తంలో తగ్గింది. దేశీయంగా చూస్తే 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.57,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,950 ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,490 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,950 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,100 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,700 ఉండగదా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,950 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,950 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,950 ఉంది. ఇక వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ.200వరకు పెరుగగా, ప్రస్తుతం కిలో వెండి ధర రూ.76,600 ఉంది.
పెద్ద నగరాల్లో బంగారం ధరలు డిమాండ్, వడ్డీ వసూలు, ఛార్జీలు, రాష్ట్ర పన్నులు, బంగారు వ్యాపారులు, బులియన్ అసోసియేషన్లు, రవాణా ఖర్చులు, మేకింగ్ ఛార్జీలు వంటి వివిధ కారణాల వల్ల బంగారం ధరలు నగరాన్ని బట్టి మారవచ్చు. భారతదేశంలో బంగారం ధరను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి కోసం బంగారానికి చాలా డిమాండ్ ఉంది. ఇతర ఆర్థిక ఆస్తుల మాదిరిగానే, బంగారం ధర కూడా హెచ్చుతగ్గులకు గురవుతుంది. దాని మార్కెట్ ధరను నిర్ణయించడంలో అతిపెద్ద అంశం డిమాండ్. అయితే, అనేక ఇతర అంశాలు కూడా ధరను ప్రభావితం చేయవచ్చు. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి