Gold Price: ఇవాళ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

పెరుగుతున్న పసిడి ధరలతో ఆందోళన చెందుతున్న సామాన్యులకు ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు శనివారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న మార్పులతో దేశీయంగా ధరలు శాంతించాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న తరుణంలో హైదరాబాద్‌ సహా పలు మెట్రో నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Gold Price: ఇవాళ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
Gold, Silver Prices Today: గత కొన్ని రోజులుగా పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న తర్వాత ప్రస్తుతం భారీగానే దిగి వస్తున్నాయి. ఈ వారం రోజుల్లో బంగారం ధరలను పరిశీలిస్తే కాస్త శాంతించాయనే చెప్పాలి. సామాన్యులకు ఇది కొంత ఊరట కలిగించే విషయమే అయినప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే ధరలు ఇంకా గరిష్ట స్థాయిలోనే ఉండటం గమనార్హం.

Updated on: Apr 18, 2026 | 7:24 AM

గత కొంతకాలంగా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి ధరలు శనివారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాల వల్ల దేశీయంగా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వివాహాల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది. హైదరాబాద్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 మేర తగ్గింది. ప్రస్తుతం రూ.1,54,190 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 తగ్గి.. ప్రస్తుతం రూ.1,41,340 వద్ద స్థిరపడింది. అటు విజయవాడ, వైజాగ్‌లలోనూ ఇవే ధరలు ఉన్నాయి. గడచిన కొన్ని రోజులతో పోలిస్తే ఈ తగ్గుదల చాలా స్వల్పమే అయినప్పటికీ, పెరుగుదల ఆగిపోవడం విశేషం.

బంగారం బాటలో వెండి

బంగారంతో పాటే వెండి ధర కూడా తగ్గుదల బాట పట్టింది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధరపై రూ.100 తగ్గింది. దీంతో కిలో వెండి రూ. 2,74,900గా ఉంది. మరోవైపు విజయవాడ, వైజాగ్‌లోనూ వెండి ధరలు హైదరాబద్‌తో సమానంగా ఉన్నాయి. పారిశ్రామిక అవసరాల కోసం వెండికి డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ, అంతర్జాతీయంగా ధరలు తగ్గడం వల్ల స్థానిక మార్కెట్లోనూ ప్రభావం కనిపించింది.

దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో బంగారం ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,54,340 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,41,490గా ఉంది. హైదరాబాద్‌తో పోలిస్తే ఢిల్లీలో వెండి ధర తక్కువగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి రూ.100 తగ్గి రూ.2,64,900గా ఉంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అత్యధికంగా రూ.1,55,010 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,090గా ఉంది. బెంగళూరు, ముంబైలలో మాత్రం హైదరాబాద్‌తో సమానంగా రూ.1,54,190 వద్ద ధరలు స్థిరంగా ఉన్నాయి. పన్నులు, రవాణా ఖర్చుల కారణంగా ఒక్కో నగరంలో ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తాయి.

Follow Us