Gold Price: బంగారం కొనేవారికి షాక్.. ఇవాళ మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..?

పుట్టినరోజు నుంచి పెళ్లి వేడుక వరకు, శుభకార్యం ఏదైనా భారతీయులకు బంగారం ఉండాల్సిందే. కష్టకాలంలో కొండంత అండగా నిలిచే ఆర్థిక భరోసా కూడా ఇదే. అయితే గత కొంతకాలంగా పసిడి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. బుధవారం కూడా పసిడి ధరలు స్వల్పంగా పెరిగి సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్‌, విజయవాడతోపాటు ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరల గురించి తెలుసుకుందాం..

Gold Price: బంగారం కొనేవారికి షాక్.. ఇవాళ మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..?
Gold Price Today

Updated on: Apr 15, 2026 | 7:12 AM

భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక మెటల్ కాదు.. స్పెషల్ సెంటిమెంట్. పెళ్లి, పండగ వేడుక ఏదైన బంగారం కొనాల్సిందే. అంతేకాకుండా కష్టసమయాల్లో ఆదుకునే ఆర్థిక భరోసా కూడా. అయితే గత కొంత కాలంగా పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బంగారం కొనలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. గతేడాది మొదట్లో రూ.లక్ష లోపు ఉన్న బంగారం ఇప్పుడు లక్షన్నర దాటింది. అంతర్జాతీయ పరిస్థితులే దీనికి కారణం అని చెప్పొచ్చు. ఇక బుధవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్‌లో ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.1,53,940 కి చేరుకుంది. ఇక అదేవిధంగా సామాన్యులు ఆభరణాల తయారీ కోసం కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములపై రూ.10 పెరగడంతో ప్రస్తుతం రూ.1,41,110 కి చేరుకుంది.

ఇతర నగరాల్లో

ఇక విజయవాడ, వైజాగ్‌ నగరాల్లోనూ హైదరాబాద్‌లో ఉన్న ధరలే కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.1,54,090గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,260 వద్ద కొనసాగుతుంది. ఇక చెన్నైలో ఇతర నగరాల కంటే బంగారం ధరలు స్వల్పంగా ఎక్కువగా ఉన్నాయి. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.1,55,140 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,42,210గా ఉంది.

వెండి ధరలు ఇలా

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.100 పెరగడంతో హైదరాబాద్‌, విజయవాడ, వైజాగ్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,65,100 కి చేరింది. కిలోపై రూ.100 పెరగడం వల్ల తులం వెండి ధర రూ.2,651 గా ఉంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ గరిష్ట స్థాయిలో ఉండటంతో వినియోగదారులు అధిక ధరలు ఉన్నప్పటికీ కొనుగోళ్లు జరుపుతున్నారు.

ధరలు పెరగడానికి కారణాలు

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తలు, సముద్ర మార్గాల్లో వాణిజ్య ఆంక్షలు వంటివి బంగారం ధరలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ఇండియన్ రిజర్వ్ బ్యాంక్‌తో పాటు చైనా, రష్యా వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వలను కేవలం డాలర్ల రూపంలోనే కాకుండా బంగారం రూపంలో భద్రపరుచుకోవాలని నిర్ణయించుకోవడం వంటివి సైతం బంగారం ధరలపై ప్రభావితం చూపిస్తున్నాయి.

Follow Us