Latest Gold Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు వాటివైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. తాజాగా బంగారం ధర మళ్లీ తగ్గింది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇటీవల తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం తగ్గిన ధరలు.. గురువారం కూడా తగ్గాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.46,120గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,120 గా ఉంది. దాదాపు రూ.300 మేర ధర తగ్గింది. అయితే.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉదయం ఆరుగంటల వరకు నమోదైన ధరల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,120 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,120గా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,520 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,570 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,350గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,110గా ఉంది.
Also Read: