Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులానికి ఎంత పెరిగిందంటే..

Gold Price Today: గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం భారీగా పెరిగాయి. దీంతో బంగారం కోనుగోలు

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులానికి ఎంత పెరిగిందంటే..
Gold Price Today

Updated on: Feb 24, 2021 | 4:43 AM

Gold Price Today: గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం భారీగా పెరిగాయి. దీంతో బంగారం కోనుగోలు చేయాలనుకునేవారు ఆలోచించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.43,850 దగ్గర కొనసాగుతుంది. నిన్నటితో పోల్చుకుంటే రూ. 590 పెరిగింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.47,840 దగ్గర కొనసాగుతోంది. నిన్నటితో పోల్చితే రూ.650 పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్‏ ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.43,850 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 47,840గా ఉంది. ఇక అటు విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేట్ 43,850 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.47,840 కొనసాగుతుంది.

ఇక దేశ రాజధానీ ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.46,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.50,180గా ఉంది. ఇక ముంబై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.45,950 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.46,950 ఉంది. ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,280 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,300గా కొనసాగుతుంది. కాగా పసిడి ధర పై అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల్లోని బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెల్లరీ మార్కెట్ ఇలాంటివి గోల్డ్ రేట్స్ పై ప్రభావం చూపుతాయని చెప్పుకోవచ్చు.

Central Electoral Commission: బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలపై కసరత్తు..