Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రెండో రోజు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఢిల్లీలో మాత్రం.

|

Jul 19, 2021 | 5:48 AM

Gold Price Today: కరోనా సమయంలో ఆకాశమే హద్దుగా పెరిగాయి బంగారం ధరలు. ఒకానొక సమయంలో తులం బంగారం ఏకంగా రూ. 50 వేలు దాటేసింది. అయితే అనంతరం పరిస్థితులు కాస్త మారాయి. క్రమంగా బంగారం ధరలు...

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రెండో రోజు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఢిల్లీలో మాత్రం.
Golf Price Today
Follow us on

Gold Price Today: కరోనా సమయంలో ఆకాశమే హద్దుగా పెరిగాయి బంగారం ధరలు. ఒకానొక సమయంలో తులం బంగారం ఏకంగా రూ. 50 వేలు దాటేసింది. అయితే అనంతరం పరిస్థితులు కాస్త మారాయి. క్రమంగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. ఇక తాజాగా వరుసగా రెండు రోజులు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల బంగారం స్వల్పంగా తగ్గగగా.. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం భారీగా పెరిగింది. సోమవారం దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,400 కాగా, 24 క్యారెట్లు ధర రూ. 51,700 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 47,190 గా నమోదుకాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,190 గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాములు 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,410 గా నమోదుకాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 49,540 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 44,900గా నమోదుకాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,000 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో సోమవారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 44,990 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 49,000 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 44,990 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,000 గా ఉంది.
* సాగర తీరం విశాఖలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 44,900 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 49,000 గా నమోదైంది.

Also Read: భారత స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రీపై కన్నేసిన టెక్నో మొబైల్‌ సంస్థ.. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లతో విడుదల

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌.. మొబైల్‌ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్స్‌

Amazon Gift Voucher: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. ఉచితంగా 10 వేల గిఫ్ట్ వోచర్‌.. ఈ రెండు షరతులు తప్పనిసరి