Gold Price Today: దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం గోల్డ్‌ రేట్‌ ఎంతంటే..

|

Dec 16, 2021 | 5:47 AM

Gold Price Today: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. వరుసగా ఏకంగా వారం రోజులపాటు గోల్డ్‌ రేట్స్‌ పెరుగుతూ వచ్చాయి. అయితే క్రమంగా పెరిగిన బంగారం..

Gold Price Today: దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం గోల్డ్‌ రేట్‌ ఎంతంటే..
Gold Price Today
Follow us on

Gold Price Today: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. వరుసగా ఏకంగా వారం రోజులపాటు గోల్డ్‌ రేట్స్‌ పెరుగుతూ వచ్చాయి. అయితే క్రమంగా పెరిగిన బంగారం ధర గురువారం భారీగా తగ్గింది. తులం బంగారంపై ఏకంగా రూ. 250 వరకు తగ్గింది. గురువారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో గోల్డ్‌ రేట్స్‌ ఇలా ఉన్నాయి..

* దేశరాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 47,150 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,430 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,910 కాగా, 24 క్యారెట్ల బంగారం రేట్‌ రూ. 47,910 గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 45,190 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,300 గా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,000 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 49,100 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో కూడా గురువారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 45,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 49,100 గా ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 45,000 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,100 వద్ద కొనసాగుతోంది.

* సాగరతీరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 45,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,100 వద్ద కొనసాగుతోంది.

Also Read: Flaxseed Gel: అవిసెగింజలతో జట్టు సమస్యలకు చెక్.. ఫ్లాక్స్ సీడ్ జెల్ ఉపయోగాలు తెలిస్తే షాకే..

Kenya Drought: కెన్యాలో తీవ్ర కరువు.. గుక్కెడు నీరు దొరకక ప్రాణాలు వదులుతున్న వన్యప్రాణులు!

Kenya Drought: కెన్యాలో తీవ్ర కరువు.. గుక్కెడు నీరు దొరకక ప్రాణాలు వదులుతున్న వన్యప్రాణులు!