Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్‌.. ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..?

Latest Gold Price: బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందిరికీ తెలిసిందే. మార్కెట్‌లో పసిడి ధరలు

Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్‌.. ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Price Today

Updated on: Sep 15, 2021 | 5:39 AM

Latest Gold Price: బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందిరికీ తెలిసిందే. మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు వాటివైపు ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి ధరలు దిగివస్తున్నాయి. బుధవారం కూడా ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.46,000గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో ఉదయం ఆరుగంటల వరకు నమోదైన ధరల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,340గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000గా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,380 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,990గా ఉంది.

Also Read:

SBI Clients: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త..! బేస్ రేటు తగ్గించిన బ్యాంక్‌

GST on Petrol: పెట్రోల్ ధరలపై శుభవార్త రాబోతోందా? జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోతున్నారా? ఎంత తగ్గవచ్చు?