
దేశంలో బంగారం ధరల్లో ప్రతిరోజు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నిన్న, మొన్నటి వరకు పెరిగిన పసిడి ధరలు ఈరోజు కొంత క్షీణించింది. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, స్టాక్ మార్కెట్లలో వచ్చిన మార్పులు, దేశీయ పెట్టుబడుల్లో అసమానతలు, వడ్డీరేట్లలో చోటు చేసుకున్న హెచ్చుతగ్గులు, డాలర్ విలువలో మార్పులు వెరసి ఇలాంటి పరిస్థితులకు కారణం అవుతోంది. అయితే నిన్న హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,550 కాగా ఈరోజు రూ. 72,540గా ఉంది. అంటే రూ. 10 తగ్గుదల కనిపిస్తోంది. అదే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర నిన్న రూ.66,500 కాగా ఈరోజు రూ. 66,490గా కొనసాగుతోంది. ఇక వెండి కూడా కిలోపై రూ.100 తగ్గి 88,900గా ఉంది. దేశంలోని పలు ప్రధాన పట్టణాల్లో నెలకొన్న బంగారం, వెండి ధరలను ఇప్పుడు పరిశీలిద్దాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..