
Gold Demand: భారతీయ సాంప్రదాయంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఉంది. భారతీయ మహిళలు బంగారంపై ఎంతో ముక్కువ చూపిస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా జ్యూలరీ షాపులు వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. అయితే గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. మధ్యప్రాచ్య ఘర్షణల కారణంగా దేశ విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగారంపై చేసిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
యుద్ధం కారణంగా తలెత్తుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బంగారం కొనకుండా ఉండటం మంచిదని వ్యాఖ్యానించారు.
దీనితో పాటు ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దీంతో బంగారం డిమాండ్‌లో భారీ తగ్గుదల నమోదైంది. పన్ను పెంపు తర్వాత దేశవ్యాప్తంగా బంగారం డిమాండ్ సుమారు 70 శాతం వరకు తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: Indian Railways: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్ న్యూస్.. మూడు పుణ్యక్షేత్రలను కలిపే ప్రత్యేక రైలు
మే 27తో ముగిసిన పక్షం రోజులలో దేశంలో బంగారం డిమాండ్ సుమారు 7.5 టన్నులకు తగ్గిందని ఆభరణాల పరిశ్రమ అంచనాలు సూచిస్తున్నాయి . గత ఏడాది ఇదే కాలంలో ఇది సుమారు 25 టన్నులుగా ఉండేది. బంగారం కొనుగోళ్లలో ఈ గణనీయమైన తగ్గుదల ఆభరణాల వ్యాపారులు, వర్తకులలో ఆందోళనలను పెంచింది.
కాగా, కేంద్రం మే 13వ తేదీ నుంచి బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ఒక నిర్ణయాన్ని అమలు చేసింది. దీనికి జీఎస్టీని కూడా జోడించడంతో బంగారంపై మొత్తం పన్ను భారం 9.18శాతం నుంచి 18.45శాతానికి పెరిగింది. ఈ దిగుమతి సుంకం భారం వినియోగదారులపై పడుతుండటంతో బంగారం కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు ప్రజలు. దీంతో అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Silver: ఇక వెండి కొనడం అంత సులభం కాదు.. కేంద్రం కీలక నిర్ణయం..!
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న నగల వ్యాపారుల నుండి అందిన నివేదికలు డిమాండ్‌లో తీవ్రమైన తగ్గుదలను ధృవీకరించాయి. బంగారం కొనుగోళ్లు తగ్గడంతో వ్యాపారం భారీగా తగ్గిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దేశంలో బంగారం డిమాండ్ తగ్గడానికి దిగుమతి సుంకాలు మాత్రమే కారణం కాదని నిపుణులు అంటున్నారు. పెరుగుతున్న ఇంధన, ఆహార ధరలు కూడా ప్రజల కొనుగోలు శక్తిపై ప్రభావం చూపాయి. బంగారం ఖరీదైనవి కావడంతో ప్రజలు కొనుగోళ్లను నిలిపివేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం దేశీయంగా తులం బంగారం ధర రూ.1,56,220 ఉంది. అలాగే వెండి ధర కిలోకు రూ.2,80,000 వద్ద ట్రేడవుతోంది.
ఇది కూడా చదవండి: OYO: ఓయోకు గ్రీన్ సిగ్నల్.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి శుభవార్త..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి