గోల్డ్ కొనాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గుతున్న ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..

బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. భారీగా పెరిగిన తర్వాత పసిడి, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలతో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్, విజయవాడతోపాటు దేశవ్యాప్తంగా రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

గోల్డ్ కొనాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గుతున్న ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..
Gold Price

Updated on: Jun 20, 2026 | 6:37 AM

రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం, వెండి ధరలు.. తగ్గుతున్నాయి.. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం, హర్ముజ్ జలసంధి తెరుచుకోవడంతోపాటు.. ముడి చమురు ధరలు పడిపోవడం లాంటి కారణాలతో బంగారం, వెండి ధరలు శుక్రవారం భారీ తగ్గాయి.. గోల్డ్ పై ఏకంగా రూ.3,600 వరకు ధర తగ్గి.. 1,45,860 వద్ద ట్రేడయింది. అయితే.. మున్ముందు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో గోల్డ్, సిల్వర్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. శనివారం (జూన్ 20, 2026 ) ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.10 తగ్గి రూ.1,45,850 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 తగ్గి రూ.1,33,690 గా ఉంది.

వెండి కిలోపై రూ.100 మేర తగ్గి రూ.2,49,900 లు గా ఉంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

  1. హైదరాబాద్‌లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,45,850, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,33,690 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.
  2. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,45,850, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,33,690 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,000 ఉంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,46,000, 22 క్యారెట్ల ధర రూ.1,33,840 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 ఉంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,45,850, 22 క్యారెట్ల ధర రూ.1,33,690 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 లుగా ఉంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.148,030, 22 క్యారెట్ల ధర రూ.1,35,690 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,45,850, 22 క్యారెట్ల ధర రూ.1,33,690 ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us