Gold Silver Price: స్థిరంగా బంగారం ధరలు.. భారీగా తగ్గిన వెండి.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.48,560కు లభిస్తోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 52,980 పలుకుతోంది. ఇదిలా ఉంటే ఈరోజు వెండి ధరలు భారీగా తగ్గాయి.

Gold Silver Price: స్థిరంగా బంగారం ధరలు.. భారీగా తగ్గిన వెండి.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Today Gold Price

Updated on: Nov 29, 2022 | 6:49 AM

బంగారం కొనుగోలు చేసే వారికి కాస్త ఊరట. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తోన్న పసిడి ధరలు మంగళవారం(నవంబర్‌ 29) నిలకడగా ఉన్నాయి. బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.48,560కు లభిస్తోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 52,980 పలుకుతోంది. ఇదిలా ఉంటే ఈరోజు వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండిపై ఏకంగా రూ.400 మేర తగ్గింది. కొత్త ధరలతో బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 61,400 గా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,560 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,980 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,560 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,980 ఉంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,560 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,980గా కొనసాగుతోంది.
  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,140 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,980 లుగా ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,470 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,970గా కొనసాగుతోంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,560 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,980 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,030 గా ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,980 గా ఉంది.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

మారిన ధరలతో ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,400లుగా ఉంది. ముంబై, కోల్‌కతా నగరాల్లోనూ ఇదే ధరకు లభిస్తుంది.
ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.68,100గా ఉండగా, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే రేటు పలుకుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us