Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతుందంటే?

Gold And Silver Price In Hyderabad - Vijayawada: మార్కెట్‌కు తగ్గట్టు దేశంలో బంగారం, వెండి ధరలు ప్రతిరోజు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. గత కొన్ని రోజుల నుంచి పసిడి ధరలు నాన్ స్టాప్‌గా పెరుగుతూనే ఉన్నప్పటి నేడు కాస్తా స్వల్పంగా తగ్గాయి. ఇక వెండి కూడా బంగారు బాటలోనే నడుస్తుంది. కాబట్టి గోల్డ్‌ రేటుతో పాటు సిల్వర్ రేట్స్‌ కూడా ఇవాళ కాస్తా తగ్గుముఖం పట్టాయి. దేనిపై ఎంత తగ్గాయో చూద్దాం పదండి.

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతుందంటే?
Gold Rate Today

Updated on: Sep 22, 2025 | 7:49 AM

గత కోన్ని రోజులుగా బంగారం ధరలు నాన్ స్టాప్‌గా పెరుగుతూనే ఉన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఇటీవల తులం బంగారం ధర రికార్డు స్థాయిలో లక్షా 13 వేల మార్క్ దాటి ఆల్ టైం హైకి చేరుకుంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తుంది. నిజానికి ఈ రెండింటి ధరలు బులియన్ మార్కెట్‌ను బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి వీటి ధరలు కొన్నిసార్లు పెరిగితే.. మరికొన్ని కొన్నిసార్లు తగ్గుతాయి. అయితే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు (సోమవారం 22-09-2025) బంగారం, వెండి ధరలు కాస్త స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. బంగారంపై రూ.10 తగ్గగా, వెండిపై రూ.100 వరకు తగ్గాయి. సెప్టెంబర్ 22 2025 సోమవారం ఉదయం ఆరుగంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

సోమవారం ఉదయం 6 గంటల నాటికి బంగారం, వెండి ధరలు

  • 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.10 తగ్గి ప్రస్తుతం రూ.1,12,140 గా ఉంది.
  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి ప్రస్తుతం రూ.1,02,790 కి చేరుకుంది.
  • వెండి కిలో ధర రూ.100 తగ్గి.. రూ.1,34,900లుగా ఉంది.

అయితే, ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది. కాబట్టి దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.10 తగ్గి ప్రస్తుతం రూ.1,12,140 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,02 ,790 ఉంది. కిలో వెండి ధర రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.1,44,900 గా ఉంది.
  • విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,12,140 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,790 ఉంది. కిలో వెండి ధర రూ.1,44,900 గా ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,12,290, 22 క్యారెట్ల ధర రూ.1,02,940 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,34,900 ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,12,140, 22 క్యారెట్ల ధర రూ.1,02,790 ఉంది. వెండి ధర కిలో రూ.1,34,900 ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,250డగా.. 22 క్యారెట్ల ధర రూ.1,02,890ఉంది. వెండి ధర కిలో రూ.1,44,900 ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,12,14022 క్యారెట్ల ధర రూ.1,02,790ఉంది. వెండి ధర కిలో రూ.1,33,500 ఉంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.