Gold Rate Today: బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే..

Gold And Silver Price In Hyderabad - Vijayawada: ప్రపంచవ్యాప్తంగా పసిడికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి.. అయితే.. ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు భారీగా పెరిగాయి.. ఏప్రిల్ నెలలో లక్ష దాటిన పసిడి ధరలు..

Gold Rate Today: బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే..
ఈ బంగారం ధరల మార్పుల వెనుక కీలక కారణంగా ప్రస్తుతం భారత్ - అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య వివాదం. అంటే సుంకాల యుద్ధం కనిపిస్తోంది. ఈ ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ మార్కెట్లపై, దేశీయ ఆర్థిక పరిస్థుతులపై ప్రభావం చూపుతుండటం వల్ల, బంగారం ధరలు కూడా పెరుగుతూనే, ఇప్పుడు కొంతమేర తగ్గింది.

Updated on: Jun 01, 2025 | 6:23 AM

Gold And Silver Price In Hyderabad – Vijayawada: ప్రపంచవ్యాప్తంగా పసిడికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి.. అయితే.. ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు భారీగా పెరిగాయి.. ఏప్రిల్ నెలలో లక్ష దాటిన పసిడి ధరలు.. ఆ తర్వాత తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి.. ఇటీవల 95వేల వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే 98వేల వరకు చేరుకున్నాయి.. తాజాగా, బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. జూన్ 1 2025 ఆదివారం ఉదయం వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర 97,310 ఉండగా.. 22 క్యారెట్ల ధర 89,200 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.99,900లుగా ఉంది.

ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,310గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,200లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,10,900లుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,310, 22 క్యారెట్ల ధర రూ.89,200లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,10,900 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,460, 22 క్యారెట్ల ధర రూ.89,350 లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.99,900లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.97,310, 22 క్యారెట్ల ధర రూ.89,200 గా ఉంది. వెండి ధర కిలో రూ.99,900లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.97,310, 22 క్యారెట్ల ధర రూ.89,200 లుగా ఉంది. వెండి ధర కిలో రూ.1,10,900లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.97,310, 22 క్యారెట్ల ధర రూ.89,200 గా ఉంది. వెండి ధర కిలో రూ.99,900లుగా ఉంది.

గమనిక, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు.. ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us