Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు.. ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతుంటాయి. తాజాగా.. మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.49,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,490 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.300 మేర పెరిగి రూ.69,300 లకు చేరింది. కాగా, దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,640 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,490, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,560, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,160 గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,490 గా ఉండగా.. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,540 గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,490 గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,490 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,490, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,490 గా కొనసాగుతోంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,300 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.69,300, చెన్నైలో కిలో వెండి ధర రూ.73,000, బెంగళూరులో రూ.73,000, కేరళలో 73000, కోల్‌కతాలో 69,300, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,000, విజయవాడలో రూ.73,000, విశాఖపట్నంలో రూ.73,000 లుగా ఉంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..