Gold Price Today: కొనుగోలు దారులకు బిగ్‌ రిలీఫ్.. మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

Gold and Silver Rate Today: బంగారం కొనుగోలు దారులకు స్వల్ప ఊరట లభించింది. గత రెండు మూడు రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు శుక్రవారం ఒక్కసారిగా దిగొచ్చాయి. శనివారం కూడా బంగారం ధరల్లో ఎలాంటి పెరుగుదల కనపించలేదు. కాబట్టి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సహా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold Price Today: కొనుగోలు దారులకు బిగ్‌ రిలీఫ్.. మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
Gold And Silver Rate Today

Updated on: Jul 18, 2026 | 7:05 AM

పసిడి ప్రియులకు బంగారం, వెండి ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. గత రెండు మూడు రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న ఈ ఆభరణాల ధరలు శుక్రవారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్, రూపాయి విలువ మారకంతో బంగారం, వెండి ధరలు మార్పుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత అంటే శనివారం ఉదయం 6గంటలకు దేశీయ మార్కెట్‌లో 24 క్యారట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,520గా వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,640 వద్ద స్థిరపడింంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,29,900 వద్ద కొనసాగుతుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

  • హైదరాబాద్‌లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,520, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,30,640 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.
  • విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,42,520, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,30,640 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,42,670, 22 క్యారెట్ల ధర రూ.1,30,790 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,29,900 ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,42,520, 22 క్యారెట్ల ధర రూ.1,30,640 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,29,900 లుగా ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.143,900, 22 క్యారెట్ల ధర రూ.1,30,990 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,520, 22 క్యారెట్ల ధర రూ.1,30,640 ఉంది. వెండి కిలో ధర రూ.2,29,900 లుగా ఉంది.

అయితే.. బంగారం, వెండి ధరలు ఒక్కో నగరాల్లో ఒక్కో విధంగా ఉంటయి. ప్రాంతాలను బట్టి వాటి ధరల్లో మార్పులు ఉంటాయి. ఎందుకంటే స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు ఈ ఆభరణాల ధరలు మారుతుంటాయి.. కాబట్టి మీరు బంగారం, వెండి ధరల కొనాలి అనుకుంటే ముందుగా లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోండి. ఇందుకోసం ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us