Telugu News Business Gold and silver prices today on 26 11 2024: Check latest rates in your city
Gold Price Today: వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
Gold Price Today: పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం, వెండి ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ఈరోజు భారతదేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర తగ్గింది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
పరుగులు పెట్టిన బంగారం ధరలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్న బంగారం ధరలు ప్రస్తుతం దిగి వస్తున్నాయి. తాజాగా నవంబర్ 26 మంగళవారం దేశీయంగా భారీగా తగ్గుముఖం పట్టింది. నిన్నటి ధరలతో పోల్చుకుంటే ఏకంగా వెయ్యి రూపాయల వరకు తగ్గింది. నిన్న ఇదే సమయానికి తులం బంగారం ధర రూ.79,630 ఉండగా, ప్రస్తుతం రూ.78,540 వద్ద కొనసాగుతోంది. అదే దాదాపుగా వెయ్యికిపైగా తగ్గిందన్నట్లు. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,540 ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.