
అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దీంతో దేశీయంగా కూడా వీటి ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. 2026 ప్రారంభం నుంచే గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఏ మాత్రం తగ్గకపోవడంతో కొనుగోలుదారులు షాక్‌కు గురవుతున్నారు. బంగారం రేట్లకు పోటీగా వెండి రేట్లల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం గోల్డ్ ధరలు రూ.1.40 లక్షల మార్క్‌కు చేరుకున్నాయి. మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో చూద్దాం.
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,160 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,42,150 వద్ద స్ధిరపడింది. అటు 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,30,310 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఈ ధర రూ.1,30,000గా ఉంది.
-విజయవాడ, విశాఖపట్నంలో కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,42,160 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,30,310 వద్ద స్థిరపడింది.
-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,140 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,210 వద్ద స్థిరపడింది
-బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1,42,160 వద్ద ప్రస్తుతం కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల బంగారం రూ.1,30,310గా ఉంది.
-ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,42,310 వద్ద ఉండగా.. 22 క్యారెట్లు రూ.1,30,460 వద్ద కొనసాగుతోంది.
-ఢిల్లీలో కేజీ వెండి రూ.2,70,100 వద్ద కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ.2,70,000గా ఉంది.
-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,87,100 వద్ద ట్రేడవుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు ఉన్నాయి.
-చెన్నైలో కేజీ వెండి రూ.2,87,100గా ఉంది.
-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,70,100 వద్ద కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ.2,70,000 వద్ద స్థిరపడింది.