Gold Prices: బంగారం ధరలు మరోసారి ఢమాల్.. రేట్లలో మళ్లీ మార్పులు.. ఇవాళ ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. అంతర్జాతీయంగా సానుకూల ధోరణి నెలకొనడం, దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో ధరలు పడిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పతనమవుతుండగా.. మంగళవారం మరోసారి తగ్గాయి. ఇవాళ వివిధ ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold Prices: బంగారం ధరలు మరోసారి ఢమాల్.. రేట్లలో మళ్లీ మార్పులు.. ఇవాళ ఎంతంటే..?
gold prices

Updated on: Feb 17, 2026 | 6:45 AM

పసిడి ధరలు మళ్లీ స్వల్పంగా తగ్గాయి. ఈ వారం మొదలు నుంచి గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గుముఖం పడిపోతున్నాయి. సోమవారం బంగారం ధర ఏకంగా రూ.1300 మేర తగ్గగా.. మంగళవారం కూడా స్వల్పంగా పడిపోయాయి. గోల్డ్ ధరలు పతనమవుతుండటంతో కొనుగోలుదారులు కూడా ఊరట చెందుతున్నారు. త్వరలో పెళ్లిళ్ల సీజన్ మొదలుకానుంది. ఈ క్రమంలో బంగారం, వెండి రేట్లు తగ్గుతుండటం కాస్త ఉపశమనం లభిస్తోంది. డాలర్ మళ్లీ బలపడుతుండటంతో బంగారం ధరలు పడిపోతున్నట్లు బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. అయితే ఈ పతనం ఎంతకాలం ఉంటుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. మంగళవారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

ఇవాల్టీ గోల్డ్ రేట్లు ఇవే..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,56,430గా కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,56,440గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,390 వద్ద కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ.1,43,400గా ఉంది.

-విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,56,430 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,390గా ఉంది

-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,57,520 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,44,390గా ఉంది.

-బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,430 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,43,390గా ఉంది.

-ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,56,580గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,540 వద్ద కొనసాగుతోంది

వెండి రేట్లు ఇవే..

-హైదరాబాద్‌లో మంగళవారం కేజీ వెండి ధర రూ.2,67,900గా ఉంది. నిన్న ఈ రేటు రూ.2,68,000 వద్ద కొనసాగుతోంది

-చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,64,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ రేటు రూ.2,65,000గా ఉంది.

-బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2,67,900గా ఉండగా.. సోమవారం రూ.2,68,000 వద్ద కొనసాగుతోంది

-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,67,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ రేటు రూ.2,68,000గా ఉంది.

Follow Us