
బంగారం కొనుగోలు చేసేవారికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఎట్టకేలకు ఈ వారంలో తొలిసారి పసిడి ధరలు దిగొచ్చాయి. ఈ వారం ప్రారంభం సోమవారం నుంచి ధరలు క్రమక్రమంగా భారీగా పెరుగుతూనే వస్తోన్నాయి. కానీ శుక్రవారం ఒక్కసారిగా పతనమయ్యాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బంగారానికి ఆకర్షణ తగ్గిందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. గోల్డ్ రేట్లు మరింత పతనమయ్యే అవకాశముందని అంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో బంగారం, వెండి ధరలు డౌన్ అవ్వడంతో.. దేశీయంగానూ ఆ ప్రభావం కనిపించింది. ఇవాళ దేశంలోని వివిధ ప్రధాన సిటీలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.
-జులై 24వ తేదీన ఉదయం 6.30 గంటల సమయంలో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4040 డాలర్ల వద్ద ఉంది. నిన్న ఔన్సుకు 4150 డాలర్ల వద్ద ఉన్నాయి. ఇక సిల్వర్ ధర 58 డాలర్లకు పడిపోయిగా నిన్న 60 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,46,170 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,990గా కొనసాగుతోంది
-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,47,290గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,35,010 వద్ద ట్రేడవుతోంది
-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,170 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,990 వద్ద కొనసాగుతోంది
-ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,320 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,34,140 వద్ద ట్రేడవుతోంది
-వెండి ధరలు కూడా తగ్గాయి
-ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,39,900 వద్ద ట్రేడవుతోండగా.. నిన్న రూ.2.40 లక్షలుగా ఉంది
-హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతోండగా.. గురువారం రూ.2,45,000గా ఉంది
-చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,44,900 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ రూ.2.45 లక్షలుగా ఉంది
-బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2,39,900 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.2.40 లక్షలుగా ఉంది.