Gold Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధర.. ఒక్క హైదరాబాద్‌లో మాత్రం భారీ పెరుగుదల..

|

Dec 01, 2022 | 6:42 AM

గురువారం దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వివాహాది శుభకార్యక్రమాల సమయంలో బంగారం కొనుగోల్లు పెరుగుతోన్నా బంగారం ధర స్థిరంగా కొనసాగుతుండడం విశేషం. దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో బంగారం ధర స్థిరంగా ఉన్నప్పటికీ ఒక్క హైదరాబాద్‌లో మాత్రం గోల్డ్ రేట్‌లో..

Gold Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధర.. ఒక్క హైదరాబాద్‌లో మాత్రం భారీ పెరుగుదల..
Gold
Follow us on

గురువారం దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వివాహాది శుభకార్యక్రమాల సమయంలో బంగారం కొనుగోల్లు పెరుగుతోన్నా బంగారం ధర స్థిరంగా కొనసాగుతుండడం విశేషం. దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో బంగారం ధర స్థిరంగా ఉన్నప్పటికీ ఒక్క హైదరాబాద్‌లో మాత్రం గోల్డ్ రేట్‌లో పెరుగుదల కనిపించింది అది కూడా 24 క్యారెట్ల గోల్డ్‌పై పెరుగుదల కనిపించింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో గురువారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,700 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 53,130 గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్స్‌ గోల్డ్ రేట్‌ రూ. 48,550 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,970 గా ఉంది.

ఇవి కూడా చదవండి

* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. కాగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 53,020 నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 48,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధరలో మాత్రం పెరుగుదల కనిపించింది. ఇక్కడ తులం గోల్డ్‌పై రూ. 880 పెరిగి రూ. 53,850 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో గురువారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,550 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,970 గా ఉంది.

* సాగరతీరం విశాఖపట్నంలో 22 క్యారెట్స్‌ గోల్డ్ రేట్‌ ధర రూ. 48,550 కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్ రూ. 52,970 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఇలా ఉన్నాయి..

వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. గురువారం దేశ వ్యాప్తంగా కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి. న్యూఢిల్లీలో సిల్వర్‌పై భారీ పెరుగుదల కనిపించింది. ఇక్కడ కిలో వెండిపై ఏకంగా రూ. 900పెరిగి రూ. 62,300గా ఉంది. ముంబైలో రూ. 62,300 గా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే వెండి ధరల్లో పెరుగుదల కనిపించలేవు. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 68,000 కాగా విజయవాడలో గురువారం కిలో వెండి ధర రూ. 68,000 కాగా విశాఖపట్నంలో రూ. 68,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..