Gold And Silver Price Today: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి. పసిడి ధరలు రోజు రోజుకు పడిపోతూనే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా పుత్తడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ఇవాళ కూడా బంగారం ధరలో తగ్గుదల కొనసాగింది. తాజాగా ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 170 తగ్గింది. దాంతో ప్రస్తుతం పది గ్రాముల గోల్డ్ రూ. 48,050 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 150 తగ్గి.. రూ. 44,050 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పుత్తడి ధరలు దేశంలోని మిగతా ప్రాంతాలకంటే తక్కువగానే ఉన్నాయి. ముంబైలో 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 44,000 వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 43,000 గా ఉంది. ఇక తెలంగాణలో రాజధాని హైదరాబాద్‌లో కూడా బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. భాగ్యనగరంలో పది గ్రాముు మేలిమి బంగారం ధర రూ. 45,700 పలుకుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 41,900 వద్ద ట్రేట్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ 10 గ్రాములకు రూ. 45,700 ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 41,900 పలుకుతోంది.
ఇదిలాఉంటే.. గతేడాది ఆగస్టులో పసిడి ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 56 వేల పైచిలుకు పెరిగింది. పెరుగుతున్న బంగారం ధరలు చూసి జనాలు బెంబేలెత్తిపోయారు. అయితే, కరోనా వ్యాక్సిన్ రావడం, మార్కెట్‌లో బంగారం డిమాండ్ తగ్గడంతో గత అక్టోబర్ నెల నుంచి పుత్తడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. మధ్యలో అప్పుడప్పుడూ పెరిగినా.. పెద్దగా మార్పు ఏం కనిపించలేదు. మొత్తంగా గరిష్ట ధర నమోదైన ఆగస్టుతో పోలిస్తే.. మార్చి ధరకు భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. దాదాపు రూ. 11,393 మేరకు గోల్డ్ ధర పడిపోయింది. అయితే, దేశీయంగా బంగారం ధరలు పడిపోవడానికి డిమాండ్ తగ్గడమే కారణమని బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఆ కారణంగానే పసిడి దిగుమతులు కూడా గణనీయంగా పడిపోతున్నాయని అంటున్నారు. బంగారం, వెండిపై దేశ ప్రజలకు మోజు తగ్గుతోందని, ఫలితంగా డిమాండ్ కూడా తగ్గుతోందన్నారు.
ఇక వెండి ధరలు మాత్రం బంగారానికి వ్యతిరేకంగా పయనిస్తున్నాయి. తాజాగా వెండి కిలో ధర రూ. 400 మేర పెరిగింది. ప్రస్తుతం వెండి ధర ఢిల్లీ మార్కెట్‌లో రూ. 66,331 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో హైదరాబాద్ కేజీ వెండి ధర రూ. 70,400 పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కిలో వెండి రేట్ రూ. 70,400 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also read: